న్యూఢిల్లీ: అగ్రికల్చరల్ టెక్నాలజీ సెక్టార్ మనదేశంలో రాబోయే ఐదేళ్లలో 60 వేల నుంచి 80 వేల వరకు ఉద్యోగాలను ఇచ్చే అవకాశం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ తెలిపింది. విత్తనాలు, నీటిపారుదల, పురుగుల మందులకు సంబంధించిన ఎన్నో సమస్యలను అగ్రిటెక్ పరిష్కరిస్తుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుబ్బురత్నం చెప్పారు.
అంతేగాక రియల్‌టైంలో వాతావరణ సమాచారం, వ్యాధుల అంచనా, నీటిపారుదల హెచ్చరికల వంటి సమాచారం ఇవ్వగలుగుతుంది. దీనివల్ల రైతులు త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అగ్రిటెక్ సెక్టార్‌కు రాబోయే ఐదేళ్లలో 80 వేల వరకు టెక్నికల్, ఆపరేషనల్, మేనేజిరియల్ నిపుణులు అవసరమని సుబ్బురత్నం చెప్పారు.
వీళ్లు ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, సప్లై చెయిన్ మేనేజ్మెంట్పై పనిచేస్తారని వివరించారు. అగ్రిటెక్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్, ఎనలిటిక్స్, ఆపరేషనల్ సపోర్ట్‌కు సంబంధించిన రంగం కాబట్టి ఇందులో పర్మనెంట్ జాబ్సే ఎక్కువగా ఉంటాయి. కోతల సమయంలో వీళ్లు డేటాను, ఎక్విప్మెంట్నిర్వహణను పరిశీలిస్తారు.
అగ్రిటెక్ సాఫ్ట్వేర్ డెవెలప్మెంట్, డేటా ఎనలిటిక్స్, మేనేజ్మెంట్ నిపుణులు ఆఫీసుల నుంచే పనిచేయవచ్చు. మెషీన్ఆపరేటర్స్, ఫీల్డ్ టెక్నీషియన్స్, అగ్రోనామిస్టులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని రత్నం వివరించారు.