'కిరోసిన్’ మూవీ ఫేమ్ ధృవ వాయు (Dhruva Vayu) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కళింగ’(Kalinga). బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మైథాలజీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాకు ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి..తమకు లాభాలను మేకర్స్ ప్రకటించారు.
కళింగ ఓటీటీ:
సస్పెన్స్ థ్రిల్లర్ మైథాలజీ కథాంశంతో తెరకెక్కిన ఈ తెలుగు హారర్ మూవీ ఇపుడు ఓటీటీలోకి రాబోతుంది. 'కళ్లు మూసిన, తెరిచిన..కనుమల్లో దాగున్న కళింగ రూపమే' అంటూ ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
కళింగ మూవీ త్వరలో స్ట్రీమింగ్ కాబోతోన్నట్లు ప్రముఖ ఆహా ప్రకటించింది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ మూవీ అక్టోబర్ 2న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. "కాంతారా", "మంగళవారం", ''విరూపాక్ష'' లాంటి సినిమాల తరహా కాన్సెప్ట్ తో కళింగ తెరకెక్కింది.
కళ్లు మూసిన, తెరిచిన...😳
— ahavideoin (@ahavideoIN) September 27, 2024
కనుమల్లో దాగున్న ఆ రూపం
Coming soon on aha 😈 pic.twitter.com/vJG0nbTMx2
కథేంటంటే::
కళింగ రాజసంస్థానంలో మనుషులు తమ శరీర అవయవాలను వాళ్ళే కోసుకొని తింటూ ఉంటారు. అలాంటి ఊహించని పలు సంఘటనలు జరగడంతో రాజు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అడివిలోని ఓ ఊళ్ళో ఒకవైపు పొలిమేర దాటి అడివి లోపలికి ఎవరు వెళ్ళరు. అటు వెళ్లిన వాళ్ళు ఎవరు బతికి తిరిగిరాలేదు.
కళింగ ఊర్లో అనాథ అయిన లింగ (ధృవ వాయు) ఆ ఊళ్ళో తన ఫ్రెండ్ (లక్ష్మణ్ మీసాల)తో కలిసి సారా కాస్తూ ఉంటాడు..ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్), అతని తమ్ముడు బలి (బలగం సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. బలి కనిపించిన ఆడవాళ్ల మీద దారుణాలకు ఒడిగడుతాడు. నచ్చిన ఆడవాళ్ళ మీద కన్నేస్తుంటాడు. ఇక లింగ చిన్నతనం నుంచి కూడా పద్దు (ప్రగ్యా నయన్) ప్రేమిస్తుంటాడు. పద్దు కూడా లింగను ప్రేమిస్తుంది. ఇంతలో పద్దు మీద బలి కన్ను పడుతుంది. లింగతో పెళ్లి చేసుకోవడానికి ఓ చిక్కు ముడి వేస్తాడు పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్).
ఊరి పెద్ద వద్ద తనఖాలో ఉన్న తన పొలాన్ని విడిపించుకుని వస్తేనే..మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని అంటాడు. దీంతో లింగకి సంస్థానంలోని స్థలం రాసిస్తాడు. అయితే, ఆ సంస్థానంలో జరిగిన నేపథ్యం ఏంటి? ఆ సంస్థానానికి గతంలో ఉన్న శాపం ఏంటి? అక్కడికి వెళ్లిన వాళ్లు మళ్ళీ ఎందుకు తిరిగి రారు? లింగ అంతటి సరిహద్దుని దాటిన తరువాత ఏం జరుగుతుంది? ఇక అందరి మధ్యలో ఉన్న అసుర భక్షి ఏంటి? ఇక ఇంతకీ రాజసంస్థానానికి ప్రస్తుతం అడివికి సంబంధం ఏంటి? ఇలాంటి సంఘర్షణలకు మధ్య ఉన్న లింగ చివరకు ఏం చేశాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.