![Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ NBK నెక్స్ట్ ఎపిసోడ్‍పై ఆహా ట్వీట్.. ఎవరు వస్తున్నారంటే!](https://static.v6velugu.com/uploads/2023/11/aha-latest-tweet-on-balakrishna-unstoppable-nbk-next-episode_3heTLs981u.jpg)
అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ(Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.
ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసి..హుషారు పెంచింది. ఇక, అన్‍స్టాపబుల్ నెక్స్ట్ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ(Aha OTT) ప్లాట్‍ఫామ్ ఇవాళ (నవంబర్ 11) ఓ హింట్ ఇస్తూ..ట్వీట్ చేసింది
READY FOR AN EXPLOSIVE PAN INDIAN EPISODE OF #UnstoppableWithNBK? ?
— ahavideoin (@ahavideoIN) November 11, 2023
DETAILS SOON... #UnstoppableWithNBK #NBKOnAHA #NandamuriBalakrishna #NBK
“అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే అదిరిపోయే పాన్ ఇండియా ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి” అని ఆహా పోస్ట్ చేసింది. పూర్తీ వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అయితే, అన్‍స్టాపబుల్ షోకి అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..లేటెస్ట్ ఫిల్మ్ అయిన యానిమల్ (Animal ) టీమ్ రానుందని ఇప్పటికే లీక్‍లు వచ్చాయి.
PS: All the guests are patakas???? Comment now!#UnstoppableWithNBK Limited Edition#UnstoppableWithNBK #NBKOnAHA #NandamuriBalakrishna #NBK#MansionHouse #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/UxxyLtjjhj
— ahavideoin (@ahavideoIN) November 11, 2023
బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి ఈ షోలో పాల్గొని కిక్ ఇస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ యానిమల్ మూవీ డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్..ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పిస్తోంది