ఆహా లో ఈ ఏడాది రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ షోస్/వెబ్ సిరీస్లు ఇవే...

ఆహా లో ఈ ఏడాది రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ షోస్/వెబ్ సిరీస్లు ఇవే...

ఆహా లో ఈ ఏడాది రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ షోస్/వెబ్ సిరీస్లు ఇవే... 

ఆహా ఓటిటి 2025లో అద్భుతమైన కంటెంట్ లైనప్‌ తో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతోంది.  ఇందులో భాగంగా డ్యాన్స్ బాటిల్స్ నుండి రొమాంటిక్ కామ్స్, ఫాంటసీ ఫిల్మ్స్ నుండి కామెడీ షోల వరకూ ఆహా ఓటిటి ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్న షోలు, వెబ్ సిరీస్ల లిస్ట్ ని ప్రకటించింది. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్‌ ప్రోమో ఫిబ్రవరి 14, 2025న రిలీజ్ అయ్యింది.  ఈ షోలో తెలుగు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా,  శేఖర్ మాస్టర్ వంటి స్టార్-స్టడెడ్ జడ్జిల ప్యానెల్ ఉంటుంది. మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు, యష్ మాస్టర్, ప్రకృతి కంబం మరియు జానులిరి వంటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ తమ టీమ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు.  

ALSO READ | వాలంటైన్స్ డే రోజున స్టార్ హీరోయిన్ కి ఖరీదైన విమానం గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు. నిజమేనా...?

సుమ హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K 4వ సీజన్ కూడా ఈ ఏడాది ప్రారంభం అవుతుంది. మొదటి సీజన్‌లో భారీ విజయాన్ని సాధించిన "త్రీ రోజెస్" వెబ్ సిరీస్ 2వ సీజన్ ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ రిలీజ్ డేట్ ఎప్పడనేది మాత్రం చెప్పలేదు. ఈ వెబ్ సీరీస్ లో ఈషా రెబ్బా, కుషిత, రాశి సింగ్, సత్య, హర్ష మరియు ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు. ఫస్ట్ సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 రాజ్ తరుణ్ మరియు కుషిత కల్లపు నటించిన "చిరంజీవ", శ్రీకాంత్ దర్శకత్వం వహించిన "హోమ్‌టౌన్‌ వెబ్ సిరీస్" షూటింగ్ మొదలైంది. ఇందులో రాజీవ్ కనకాల, ఝాన్సీ మరియు ప్రజ్వల్ యాద్మా తదితరులు నటిస్తున్నారు.  జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న "సర్కార్" గేమ్ షో 5వ సీజన్ కూడా రిలీజే కానుంది. దీంతో సబ్ స్క్రైబర్స్ కి ఏడాది పొడవునా ఎంటర్టైన్ మెంట్  అందించేందుకు ఆహా సిద్ధమవుతోంది.