వచ్చేనెల దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే. వచ్చేనెలలో ఢిల్లీ పక్కనే ఉన్న యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోయిడా పోలీసులు జరిపిన సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 4.72 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు రోజే పోలీసులు జరిపిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 99 లక్షల నగదును సీజ్ చేశారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. నోయిడా పరిధిలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు. పోలీసులు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా తనిఖీలను కూడా పెంచారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. ఓ వెహికల్ లో అనుమానాస్పదంగా తరలిస్తున్న వాషింగ్ పౌడర్ డబ్బాల్ని పోలీసులు గుర్తించారు. వాటిలో ఏముందో అని తనఖీలు చేయగా నోట్లకట్టలు బయటపెట్టాయి. నగదు ఎక్కడిది ? ఎవరు ఇచ్చారు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సక్సేనా, సంజీవ్ కుమార్ ఝా అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకననారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి: