రైతుల ఆందోళనతో ఉద్రిక్తత.. ఢిల్లీలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

రైతుల ఆందోళనతో ఉద్రిక్తత.. ఢిల్లీలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు అన్నదాతలు. ఈ క్రమంలో ఇవాళ ( డిసెంబర్ 2, 2024 ) పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. దీంతో సోమవారం ఉదయం యూపీ రైతులు నోయిడా నుంచి ఢిల్లీ వరకు మార్చ్‌ నిర్వహించటంతో ఢిల్లీ - నోయిడా సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు పెద్దఎత్తున పాదయాత్ర చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ALSO READ : జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లపై రైతులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే, కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేకపోగా... రైతులతో చర్చలకు కూడా మోడీ సర్కార్ సుముఖంగా లేకపోవడంతో పార్లమెంట్ ముట్టడికి పిలుపినిచ్చాయి రైతు సంఘాలు.

సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా వంటి కీలక రైతు సంఘాలు  చేపట్టిన పాదయాత్రను భద్రతా దళాలు నిలిపివేయడంతో పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి ప్రాంతాల్లో నిలిచిపోయారు రైతులు. శంభు, ఖనౌరిలలో రైతులు గత 293 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.