వచ్చే వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తా్యని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో వరదలను నివారించడానికి GHMC అప్రమత్తమైంది. వరద నిర్వాహణకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని రూ.250 కోట్లు సహాయం కోరుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాకాలం నాలాల నిర్వాహణ, వాటర్ సప్లై కోసం రూ.200 కోట్లు, ఫ్లడ్ మేనేజ్ మెంట్ కోసం రూ.50 కోట్లు జీహెచ్‌ఎంసీ కేటాయించింది. అయితే ఈ నిధుల కోసం నేషనల్ డిజాస్టర్ మేనెజ్ మెంట్ అథారిటీని కోరింది.
నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండ్ ప్రోగ్రామ్ కింద, వర్షాకాలం కోసం హైదరాబాద్‌తో సహా అత్యధిక జనాభా కలిగిన 7 నగరాల్లో వరదల ప్రమాదాన్ని తగ్గించడానికి కేంద్రం 2,500 కేటాయించింది. అయితే ఇప్పటి వరకు నగరానికి నిధులు విడుదల కాలేదు. ఈలోగా, SNDP ఫేజ్-1 కింద GHMCలో వరదల నివారణ కోసం రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 37 కరకట్ట పనులను చేపట్టింది.