తెలంగాణ ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా? లేదా?.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందా? లేదా?.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చంటూ రోజుకో వార్త తెరమీదకు వస్తోంది. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి ఓటరు.. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో! లేదో! సరిచూసుకోవాలని ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 

ఓటు వేయటానికి ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు. ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. ఇది గమనించగలరు. ఈ విధంగా సరిచూకున్నట్లయితే, మీ పేరు లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా మీ అభ్యంతరాలను వివరించచ్చు. కావున ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేసుకోగలరు.

ఓటరు జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే

  • ముందుగా తెలంగాణ ఓటర్ సర్వీస్ పోర్టల్ Ceo-Telangana అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • అనంతరం హోమ్ పేజీలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ (Search Your Name)పై క్లిక్ చేసిఅసెంబ్లీ నియోజకవర్గం(Assembly Constituency) ఎంచుకోవాలి.
  • ఇప్పుడు మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని.. మీ పేరు, పుట్టిన తేదీ, మీరు పురుషులు/మహిళలు అన్నది ఎంపిక చేసుకోవాలి. 
  • చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  •  మీ పేరు ఓటరు జాబితాలో ఉన్నట్లయితే.. వివరాలు వస్తాయి. లేనియెడల వివరాలు లేవని డిస్ ప్లే అవుతుంది.