ఎన్నికల ముందు కేజ్రీవాల్ షాక్..ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా

ఎన్నికల ముందు కేజ్రీవాల్ షాక్..ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా
  • కేజ్రీవాల్​కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు
  • రిజైన్ చేసిన వాళ్లంతా అసెంబ్లీ టికెట్ దక్కని వాళ్లే

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో గత ఐదు రోజుల్లోనే ఆరుగురు రిజైన్ చేయడం గమనార్హం. కేజ్రీవాల్​పై, ఆప్​పై నమ్మకం కోల్పోయామని అందుకే పదవితోపాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు పాలం ఎమ్మెల్యే భావనా గౌర్​తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

ఆప్ తన ‘‘నిజాయితీతో కూడిన రాజకీయాలు’’ అనే వ్యవస్థాపక సూత్రాన్ని విడిచిపెట్టిందని మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ అవినీతి బురదలో చిక్కుకుందని ఆరోపించారు. జనక్‌‌‌‌పురికి చెందిన రాజేశ్ రిషి ‘‘అవినీతి రహిత పాలన, పారదర్శకత అనే తన ప్రధాన విలువల నుంచి ఆప్ తప్పుకుంది” అంటూ లేఖలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

గత ఐదురోజుల్లో నరేశ్ కుమార్, రోహిత్ కుమార్, రాజేశ్ రిషి, మదన్ లాల్, పవన్ శర్మ, భావన గౌర్ రిజైన్ చేయగా.. భూపిందర్ సింగ్ జూన్ లోనే రాజీనామా చేశారు. అయితే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ ఈసారి టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.. అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ దక్కకపోవడంతోనే వారంతా పార్టీ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.