కరాటే నా జీవితంలో భాగం: టీ పీసీసీ చీఫ్ మహేశ్

కరాటే నా జీవితంలో భాగం: టీ పీసీసీ చీఫ్ మహేశ్

కరాటే  తన జీవితంలో ఒక భాగమన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ ప్రసాద్,మంత్రి పొన్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్..  సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మార్చి 26 నుంచి 4వ  కియో నేషన్ కరాటే చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు.  అన్ని రాష్టాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఏ స్పోర్ట్స్  అయినా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

Also Read : కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 156 వడ్ల కొనుగోలు సెంటర్లు

దేశంలో చాలా మంది కరాటే క్రీడాకారులున్నారని చెప్పారు  టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. 2030 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులు ఎదగాలన్నారు. దాని కోసం తెలంగాణ క్రీడాకారులు సిద్ధం కావాలని సూచించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఏషియన్ కరాటే పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ బడ్జెట్ లో స్పోర్ట్స్ రంగానికి రూ. 465 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు మహేశ్ గౌడ్. కొన్ని గొప్ప గొప్ప స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ లేకుండా ఉన్నాయని చెప్పారు మహేశ్ కుమార్ గౌడ్.