రీమాసేన్, సదా, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి అభిరాంతో ‘అహింస’ తెరకెక్కించాడు. ఇందులో గీతా తివారి లీడ్ రోల్ కోసం ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాలను ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. దర్శకుడు కథ చెప్పగానే తన పాత్రతో ప్రేమలో పడిపోయానని తెలిపింది. సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కుటుంబాన్ని అమితంగా ప్రేమించే అహల్యగా గీతికా నటిస్తుందట.
అయితే, 90 శాతానికి పైగా షూటింగ్‌ను మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో చేశారని తెలిపింది. అది చాలా ఇబ్బందిగా అనిపించినా కథ డిమాండ్ చేయడంతో ఆ లొకేషన్లనే ఎంచుకున్నాం. తొలి సినిమాకే ఇలాంటి చాలెంజ్‌ను ఎదుర్కోవడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. నా సొంత రాష్ట్రం కూడా అదే. అక్కడే పుట్టి పెరిగిన నేను యాడ్స్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను’ అంటూ చెప్పుకొచ్చింది.