T20 World Cup 2024: అతడొక డూప్లికేట్ కింగ్.. నాలా కూడా ఆడలేదు: బాబర్‌పై పాక్ మాజీ బ్యాటర్ ఫైర్

T20 World Cup 2024: అతడొక డూప్లికేట్ కింగ్.. నాలా కూడా ఆడలేదు: బాబర్‌పై పాక్ మాజీ బ్యాటర్ ఫైర్

టీమిండియాలో విరాట్ కోహ్లీకి ఎంత ఫాలోయింగ్ ఉందో పాకిస్థాన్ లో బాబర్ కు అంతే పాపులారిటీ ఉంది. ఇక్కడ మనం కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటే పాక్ దేశంలో బాబర్ ను తమ క్రికెట్ కింగ్ అని భావిస్తారు. ఫార్మాట్ ఏదైనా బాబర్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మూడు ఫార్మాట్ లో 40 కి పైగా యావరేజ్ ఉన్న అతికొద్ది మంది ప్లేయర్లలో బాబర్ అజామ్ ఒకడు. అయితే ఐసీసీ టోర్నీల విషయానికి వస్తే ఈ పాక్ కెప్టెన్ ఘోర ప్రదర్శన చేస్తున్నాడు. 

ఒక్క మ్యాచ్ విన్నింగ్ నాకు కూడా ఆడలేకపోతున్నాడు. అడపాదడపా నెగ్గుకొస్తున్న స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతున్నాడు. దీనికి తోడు కెప్టెన్సీలోనూ దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో బాబర్ పై మాజీ పాక్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డాడు. "బాబర్ ఒక ఫేక్‌ కింగ్‌. సోషల్‌ మీడియా హైప్‌ కారణంగా అతడిని అనవసరంగా హైలెట్ చేస్తున్నారు. ఐసీసీ టోర్నీలో కనీసం నేను ఆడినట్టు కూడా ఆడలేకపోయాడు. అతనికంటే నేనే నయం". అని షెహజాద్ బాబర్ పై విరుచుకుపడ్డాడు. 

టీ 20 వరల్డ్ కప్ లో పాక్ తరపున 9 మ్యాచ్ లాడిన షెహజాద్ 31 యావరేజ్ తో 250 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ కూడా ఉంది. మరోవైపు బాబర్ 22 ఇన్నింగ్స్ ల్లో 27 యావరేజ్ తో 545 పరుగులు చేశాడు. చివరి వరల్డ్ కప్ 2022 లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 చేరుకోవడానికి కష్టాలు పడుతుంది. మూడు  మ్యాచ్  లాడిన పాక్ జట్టు కెనాడతో మాత్రమే విజయం సాధించింది. 

ఐర్లాండ్ తో మిగిలిన మ్యాచ్ గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్, అమెరికా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిస్తే పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ లో గెలిచినా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే పాక్ ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.