Cricket World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్ : హోటల్ గది లక్షా 25 వేలు

Cricket World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్ : హోటల్ గది లక్షా 25 వేలు

వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా చేరుకున్నాయి. 45 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీ ఆదివారం(నవంబర్ 19) ముగుస్తుంది. స్వదేశంలో వరల్డ్ కప్ ఫైనల్ జరగడంతో భారత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఇప్పటికే రెడీ అయిపోయారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ చూడాలనుకుంటున్న అభిమానులకు మాత్రం ఊహించని రీతిలో షాక్ తగిలింది. 

అహ్మదాబాద్ హోటల్ లో ఉండాలంటే లక్షలు ఉండాల్సిందే. ఇక్కడ హోటల్ ధరలు ఆకాశాన్ని దాటేశాయి. ఒక్క రాత్రి ఇక్కడ హోటల్లో ఉండాలంటే 1 లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ గదుల ఛార్జీలు 24 వేల రూపాయాల నుంచి లక్ష రూపాయలు దాటిపోయింది. ప్రాథమిక హోటల్ గదికి రాత్రికి రూ. 10,000 ఛార్జ్ చేస్తున్నారు. అయితే 5 స్టార్ లాంటి లగ్జరీ హోటళ్లు ఒక రాత్రి బస చేయాలంటే లక్షకు పైగా వసూల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ కావడంతో అహ్మదాబాద్ హోటల్స్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. వీటితో పాటు అహ్మదాబాద్ కు వెళ్లే విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి. 

లక్ష 30 వేల మంది సామర్ధ్యం కలిగిన ఈ స్టేడియం సీటింగ్ పరంగా ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియం. స్వదేశంలో వరల్డ్ కప్ కావడం, భారత్ ఫైనల్ కు చేరడంతో ఈ మ్యాచ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ మెగా ఫైనల్ చూసేందుకు పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులతో పాటు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఈ మ్యాచ్ కు హాజరు కానున్నారు.            

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by viralgully (@viralgully)