ఫిబ్రవరి 26న అహోరాత్ర అభిషేకం

ఫిబ్రవరి 26న అహోరాత్ర అభిషేకం

ఖైరతాబాద్, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న కూకట్​పల్లి కైతలాపూర్​గ్రౌండ్స్​లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 26న సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు అహోరాత్ర అభిషేకం జరుగుతుందన్నారు. 108 నదుల నుంచి తీసుకువచ్చిన గంగా జలంతో పూజలు ఉంటాయన్నారు.