AI.. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్. ఎలా పడితే అలా వాడేస్తున్నారు.. ఏదో కొత్తగా వచ్చింది కదా.. అందరూ ఏఐ వాడేస్తున్నారు.. మనం కూడా వాడకపోతే ఎలా అన్నట్లు.. ఎందులో పడితే అందులో వాడుస్తున్నారు. ఇలా ఏఐని వాడేసి తప్పులో కాలేసిన ప్రముఖ ఆస్ట్రాలజీ సంస్థ కథనే ఇదీ..
దేశవ్యాప్తంగా ప్రముఖ ఆన్ లైన్ ఆస్ట్రాలజీ పోర్టల్.. జ్యోతిష్యంలోనూ AI ప్రవేశపెట్టింది. ఇది ఏదో బాగుందని.. ఓ కస్టమర్ 10 నిమిషాలకు స్లాట్ బుక్ చేసుకుని డబ్బులు కట్టారు. తన పుట్టుక వివరాలు ఇచ్చిన తర్వాత.. AI జ్యోతిష్యం నుంచి వచ్చిన సమాధానం షాక్ కు గురి చేసింది. మీకు ఇంకా పెళ్లి కాలేదు. రాబోయే మూడేళ్లలో పెళ్లి అవుతుంది అని చెప్పింది. అవాక్కయిన మహిళ.. నాకు ఇప్పటికే పెళ్లయ్యింది.. భర్తతో హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పింది. అంతే AI తన చాట్ ను క్లోజ్ చేసింది. ఇంకా టైం ఉంది.. నేను 10 నిమిషాలకు డబ్బులు కట్టాను.. మిగతా మొత్తం భవిష్యవాణి చెప్పు అన్నా చెప్పలేదు. చాట్ క్లోజ్ చేసేసింది ఏఐ..
AI భవిష్యవాణి ఎంత తప్పుగా ఉందో.. ఎంత గందరగోళంగా సమాధానాలు ఇస్తుందో చూడండీ అంటూ ఆ మహిళ.. తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముందీ నెటిజన్లు ఆడుకున్నారు. ఆస్ట్రోటాక్.. ఆస్ట్రో చాట్ పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారని.. AI పేరుతో అడ్వాన్స్ టెక్నాలజీ పేరుతో వందకు వంద శాతం కరెక్ట్ చెబుతాం అంటూ దోపిడీ చేస్తున్నారంటూ నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకోవటం మొదలుపెట్టారు.
ALSO READ | బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
జనం బలహీనతలతో ఆడుకునే ఇలాంటి భవిష్యవాణి AIలను బ్యాన్ చేయాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. జ్యోతిష్యం విలువను తగ్గించేస్తున్నారని.. జ్యోతిష్యాన్ని వ్యాపారంగా.. దోపిడీగా మార్చేశారంటూ మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. కోట్ల మంది ఉపయోగించే ప్రముఖ ఆస్ట్రాలజీ పోర్టల్స్ ఇలా మోసం చేయటం దారుణం.. దుర్మార్గం.. ఈ పోర్టల్ పై చర్యలు తీసుకోవాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఏదిఏమైనా AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కవ వాడాలో.. ఎక్కడ వాడకూడదో కూడా తెలియాలి.. లేకపోతే అసలుకే మోసం వస్తుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. బీ కేర్ ఫుల్ పబ్లిక్.. AI కొత్తగా ఉందని వాడకం మొదలుపెడితే ఇలాగే మోసపోతారు.