అమెజాన్లో AI:10 వేల మంది ఉద్యోగులకు ముప్పు..తిట్టిపోస్తున్న టెక్ నిపుణులు

అమెజాన్లో AI:10 వేల మంది ఉద్యోగులకు ముప్పు..తిట్టిపోస్తున్న టెక్ నిపుణులు

ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. స్టార్టప్ లనుంచి ప్రముఖ కంపెనీల వరకు అన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలామంది ఉద్యోగులు వీధిన పడుతున్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న టెక్ లేఆఫ్స్ ఉద్యోగుల తొలగింపులు. 2025లో ప్రారంభం నుంచి భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో అమెజాన్ ఒకటి. అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. గత నవంబర్ లో దాదాపు 18 వేల మంది వర్క్ ఫోర్స్ ను తొలగించిన అమెజాన్ తాజాగా 10వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 

అయితే అమెజాన్ ఉద్యోగుల తొలగింపులపై టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.  అమెజాన్ ఇటీవలి తొలగింపు ప్రకటనను కంప్లీట్ సర్కిల్ CIO గుర్మీత్ చద్దా ఖండించారు. ఆవిష్కరణల ముసుగులో పెద్ద మొత్తంలో తొలగింపులను చాద్దా ఖండించారు. టెక్నాలజీ అభివృద్ది ప్రజల జీవనోపాధికి హాని కలిగించకూడదని వాదించారు. AI, ఇతర విధ్వంసం కలిగించే టెక్నాలజీ ప్రజలకు కష్టాలు తెచ్చిపెడితే వాటికి అర్థం లేదన్నారు. 

ALSO READ | Good news: క్యాన్సర్కోసం కొత్తరకం ట్రీట్మెంట్..మనోళ్లే కనుగొన్నారు..ఖర్చు చాలా తక్కువ

గురునానక్ దేవ్ ' సర్బత్ ద భల్లా '(అందరికీ సంక్షేమం) తత్వాన్ని చెపుతూ.. ఏదైనా ఆవిష్కరణలో ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీ నిర్వహణ, అభివృద్ధి అని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగుల తొలగించిన తర్వాత  చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు.