ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 2023లో సాంకేతిక రంగంలో సంచలనం సృష్టించింది. AI ప్రభావం చూపని రంగం లేదు..రకరకాల మోడళ్లతో ప్రపంచాన్ని ఏలుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు AI జ్యోతిష్య రంగంలోకి కూడా ప్రవేశించింది. మనం ఎప్పుడు చనిపోతామో కూడా చెపుతుందట. ఈ AI ఆధారిత డెత్ ప్రిడెక్టర్ 78 శాతం కరెక్ట్ గా చెబుతుంది. మీరు విన్నది నిజమే.. డెన్మార్క్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డెత్ ప్రిడెక్టర్ ను అభివృద్ది చేశారు.
Life 2vec అని పిలువబడే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డెత్ ప్రిడెక్టర్.. వ్యక్తి బతికుండే కాలాన్ని అంచనావేయడంలో ఖచ్చితంగా చెబుతోంది. ఇతర AI మోడళ్లలా కాకుండా భవిష్యత్ లో ఏమి జరుగుతుందో అంచనా వేయడానికి ఉన్న వివరాలతో చాట్ బాట్ లా పనిచేస్తుంది.
వ్యక్తి ఆదాయం, వృత్తి, నివాసం, ఆరోగ్యచరిత్ర ఆధారంగా ఆ వ్యక్తి మరణించే కాలాన్ని 78 శాతం ఖచ్చితంగా చెబుతుంది. Life 2vec డెత్ ప్రిడెక్టర్ ను అభివృద్ధి చేసిన పరిశోధకులు 2008 నుంచి 2020 వరకు 6మిలియన్ల డానిష్ ప్రజలపై పరిశోధనలు జరిపి ఈ డెత్ ప్రిడెక్టర్ ను అభివృద్ది చేశారట.
డెత్ ప్రిడిక్షన్ అనేది స్టాటిస్టికల్ మోడలింగ్ లో తరుచుగా చేసే పని.వ్యక్తి ఆరోగ్య అంచనా పనులకు సంబంధించింది. అందువల్ల సరైన ఫలితాన్ని అంచనా వేయొచ్చు. అయితే ప్రస్తుతం ఈ చాట్ బాట్ ప్రజలకు, కార్పొరేషన్లకు అందుబాటులో లేదు.