
- బల్దియా కమిషనర్ ఇలంబరితి హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండకపోతే యాక్షన్తప్పదని కమిషనర్ ఇలంబరితి హెచ్చరించారు. గురువారం హెడ్డాఫీసులో జోనల్ కమిషనర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ అధికారుల టైమింగ్స్పరిశీలించేందుకు హెడ్ ఆఫీసులో మాదిరిగా జోనల్, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ఏఐ బేస్డ్సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఐటీ అధికారులకు ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ఆఫీసర్లు, సిబ్బంది టైమింగ్స్ బాధ్యత జోనల్ కమిషనర్లదేనని అన్నారు.
‘బిల్డ్ నౌ’తో ఈజీగా బిల్డింగ్ పర్మిషన్లు
‘బిల్డ్ నౌ’ అప్లికేషన్ తో భవన నిర్మాణాల అనుమతులు ఇకపై వేగంగా జారీ అవుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి చెప్పారు. గురువారం ఆయన బల్దియా హెడ్డాఫీసులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో రూపొందించిన బిల్డ్ నౌపై జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఓరియంటేషన్ శిక్షణ ఇచ్చారు. మార్చి 9 వరకు శిక్షణ కొనసాగుతుందని, మార్చి 10 నుంచి అప్లికేషన్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్లాన్ అప్ లోడ్ చేసే సమయంలో అందులోని లోపాలను ఏఐ టెక్నాలజీతో ఆటోమెటిక్ గా గుర్తిస్తుందని, దీంతో నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ని మొదటి నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉండదన్నారు.
బిల్డింగ్ప్లాన్ చెరువు పక్కన ఎంత దూరంలో ఉంది, కోర్టు కేసులు ఉన్నాయా అని పరిశీలించేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంత్, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, రవికిరణ్, వెంకన్న, అడిషనల్ సీసీపీ గంగాధర్ పాల్గొన్నారు.