హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ... దేశంలోనే అతి పెద్దది..

హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ... దేశంలోనే అతి పెద్దది..

పారిస్​లో ఏర్పాటు చేసిన స్టేషన్ ఎఫ్​, టొరంటోలోని మార్స్​ డిస్కవరీ డిస్ట్రిక్ట్​ వంటి వాటిని ఎగ్జాంపుల్​గా తీసుకుని మన రాష్ట్రంలోనూ ఏఐ సిటీని సర్కారు ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 200 ఎకరాల్లో దానిని నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఏఐ సిటీగా దానిని రూపుదిద్దేందుకు కసరత్తులను ప్రారంభించింది. డేటా సెంటర్లు, హై పెర్ఫార్మెన్స్​ కంప్యూటింగ్​ ఫెసిలిటీలు, సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త ఆవిష్కరణలు చేసేలా సంస్థలను ఎంపవర్​ చేసే కేంద్రాలను ఏఐ సిటీలో ఏర్పాటు చేయనుంది. ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ట్యాక్సుల రూపంలో ఇన్సెంటివ్స్​ను సర్కారు అందించనుంది.

Also Read:-హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్

ఏఐ సిటీకి అనుబంధంగా రీసెర్చ్​ సెంటర్లు, స్కిల్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనుంది. ప్రజలు అత్యాధునిక ఏఐ టెక్నాలజీస్​ను అందిపుచ్చుకునేలా ఏఐ సిటీలో ఏఐ సెంటర్​ ఫర్​ ఫ్యూచర్​ను అభివృద్ధి చేయనుంది. ప్రపంచంలో ఉన్న ఏఐ అప్లికేషన్లపై ఇందులో ఎగ్జిబిషన్లు, వర్క్​షాప్స్​, డిమాన్​స్ట్రేషన్లను ఇవ్వనున్నారు. అంతేగాకుండా ఏఐ కళాక్షేత్ర పేరిట కల్చరల్​ క్రియేటివ్​ ఏఐ జోన్​ను సర్కారు ఏర్పాటు చేయనుంది. కళలు, సంస్కృతిని ఏఐ టెక్నాలజీతో మేళవించి ఆర్టిస్టిక్​ క్రియేటివిటీని దానికి కూర్చనుంది. 

50 యానోటేషన్​ సెంటర్లు

ఏఐ మోడల్స్​ అభివృద్ధికి డేటా యానోటేషన్​ (ఓ కామెంట్​ లేదా పదానికి వివరణాత్మక నోట్​ఇవ్వడం) చాలా కీలకం.  ఇందులో భాగంగానే యానోటేషన్​ హబ్​ను రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 50 యానోటేషన్​ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా పది వేల ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ ప్రోగ్రామ్​లో భాగంగా చదువుకునేటప్పుడే విద్యార్థులు సంపాదించు కునేలా డేటా యానోటేషన్​పై ప్రోత్సహించనుంది. నెలకు రూ.5 వేలు సంపాదించుకు నేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించనుంది. అందుకు ‘తెలంగాణ వైభవం – ఏఐ ప్రోగ్రామ్​’ను ప్రభుత్వం చేపట్టనుంది.

ఇందులో భాగంగా పది లక్షల మంది డేటా యానోటేషన్స్​ చేసి.. వెయ్యి కోట్ల టోకెన్లను జనరేట్​ చేసేలా చర్యలు తీసుకోనుంది. తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఏఐ డేటా సెట్స్​ను రూపొందించేందుకు ఈ తెలంగాణ వైభవం ఏఐ ప్రోగ్రామ్​ను సర్కారు తీసుకొస్తున్నది. సీఎం నేతృత్వంలో దీనిపై భారీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు తెలంగాణ సంస్కృతిపై డేటా సెట్స్​ ప్రిపేర్​ చేసేలా ప్రోత్సహించనున్నారు. 

స్కూళ్లలో ఏఐ పాఠాలు

15 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఏఐ ఫౌండేషనల్​ నాలెడ్జ్​ను పెంపొందించేలా స్కూళ్లలో ఏఐని సర్కారు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలోనూ ఏఐ కరికులమ్​ను తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగా స్కూళ్లకు ఏఐ లెర్నింగ్​ కిట్స్​ను అందించడంతో పాటు టీచర్లకు ఏఐపై శిక్షణ ఇవ్వనుంది. 2027 నాటికి అన్ని సీనియర్​ సెకండరీ స్కూళ్లలో అన్ని ఏఐ విభాగాలను కవర్​ చేసేలా ప్రణాళికలను రూపొందించుకుంది. 5 వేల ప్రభుత్వ బడుల్లో ఏఐ పాఠాలు తీసుకురావాలని సంకల్పంగా పెట్టుకుంది.

20 వేల టీచర్లకు ఏఐపై శిక్షణ ఇవ్వడంతో పాటు 5 లక్షల మంది సీనియర్​ సెకండరీ విద్యార్థులకు ఏఐలో స్కిల్స్​ పెంచాలని టార్గెట్​ పెట్టుకుంది. ఏఐ సిలబస్​ను నాలుగు కాంపోనెంట్లుగా విభజించాలని సర్కారు నిర్ణయించింది. ఐవోటీ, క్లౌడ్​ యాక్సెస్​, ఏఐ టూల్స్​, లైసెన్సెస్​, టీచర్​ ట్రైనింగ్​ కాంపోనెంట్లుగా విభజించి శిక్షణ ఇస్తారు. 

ఏఐ, ఏఐ టూల్స్​ ఇంట్రడక్షన్​: ఏఐ, ఏఐ టూల్స్​ అంటే ఏంటి.. వాటి వల్ల ఉపయోగాలేంటి, సమాజంపై ప్రభావం, డేటా లిటరసీ, డేటా కలెక్షన్​, క్లీనింగ్​ వంటి టాపిక్స్​ను విద్యార్థులకు చెప్తారు. గూగుల్​ టెన్సర్​ ఫ్లో, మైక్రోసాఫ్ట్​ అజూర్​ ఎంఎల్​, ఐబీఎం వాట్సన్​, పైథాన్​ వంటి ఓపెన్​ సోర్స్​ టూల్స్​ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. 

ఏఐతో అనుభవాత్మక లెర్నింగ్​: ఏఐని ప్రాక్టికల్​గా ఇంప్లిమెంట్​ చేసే ప్రాజెక్టులపై విద్యార్థులకు ట్రైనింగ్​ ఇస్తారు. రోజువారీ సమస్యల పరిష్కారం కోసం ఏఐ వాడకంపై విద్యార్థులకు ఎక్స్​పీరియన్స్​ వచ్చేలా ట్రైనింగ్​ ఇస్తారు. ఇంటెల్స్​ ఏఐ ఫర్​ యూత్​ ప్రోగ్రామ్​ ఆధారంగా దీనిని డిజైన్​ చేశారు. స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్​ను ఏర్పాటు చేయనున్నారు. 

అందరికీ ఏఐ

విద్యార్థులు, యూత్​కే కాకుండా 15 నుంచి 60 ఏండ్ల వాళ్లందరికీ ఏఐని చేరువ చేయాలని సర్కా ర్​ తన ఏఐ రోడ్​ మ్యాప్​లో నిర్దేశించుకుంది. సీని యర్​ సిటిజెన్లు (ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, టైం కు మందులేసుకునేలా వారికి గుర్తుచేయడం, సాయం), హెల్త్​కేర్​ ప్రొఫెషనల్స్​ (పేషెంట్​ మేనేజ్​మెంట్, డయాగ్నస్టిక్​ టూల్స్, టెలీమెడిసిన్), టీచ ర్లు/లెక్చరర్లు (పర్సనలైజ్డ్​ లెర్నింగ్​, గ్రేడింగ్​, అసెస్​మెంట్స్​, అడ్మిన్​ టాస్క్స్​), గిగ్​ ప్రొఫెషనల్స్​ (వర్క్​ షెడ్యూల్స్​ను ఆప్టిమైజ్​ చేయడం, జాబ్​ సెర్చ్​, ఆర్థిక పరిస్థితులను నిర్వహించుకోవడం), వైట్​ కాలర్​ ప్రొఫెషనల్స్​, బ్లూ కాలర్​ ప్రొఫెషనల్స్​ (జాబ్​ సేఫ్టీ పెంచడం, శిక్షణ, సామర్థ్యపెంపు) వంటి వారందరికీ ఏఐపై శిక్షణ ఇవ్వనుంది. 

యూనిఫైడ్​ ఏఐ సర్వీసెస్​

టీ హబ్​, వీ హబ్​, టీవర్క్స్​, వై హబ్​, టాస్క్​ ఇతర సంస్థలు రాష్ట్రంలో ఏఐ స్టార్టప్​ ఎకో సిస్టమ్​ను సపోర్ట్​ చేస్తున్నాయి. వీటిన్నింటి ఆధారంగా ఓ సెంట్రలైజ్డ్​ సపోర్ట్​ సిస్టమ్​ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా హెల్త్​ కేర్​, అగ్రికల్చరల్, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ వంటి డొమెయిన్లకు యూనిఫైడ్​ వెబ్​ ఇంటర్​ఫేస్​ను రూపొందించనున్నారు.

యూనివర్సిటీ స్టూ డెంట్లు, మహిళా ఇన్నోవేటర్లను గుర్తించడం, వాళ్లు తయారుచేసిన ప్రాజెక్టుల మెచ్చూరిటీ ఫేజ్​ను ఐ డెంటిఫై చేయడం ఈ యూనిఫైడ్​ వెబ్​ ఇంటర్​ఫేజ్​ చేస్తుంది. ఏఐ స్టార్టప్స్​ కోసం పబ్లిక్​ డైరెక్టరీని ఏ ర్పాటు చేయనుంది. ఏఐలో కొత్త ఆవిష్కరణలకు సర్కారు ఫండింగ్ ఇవ్వనుంది. ప్రైవేట్​ ఈక్విటీ, వెం చర్​ క్యాపిటల్​, గ్రాంట్ల రూపంలో సాయం చేస్తుంది. 

ఉపాధికి ఏఐ

ఏఐ స్కిల్స్​తో కూడిన ఉపాధిని పెంచేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. సాఫ్ట్​వేర్​, సేవల రంగాల్లో 2027 నాటికి ఏఐ వాడకం 35 శాతం వరకు పెరగొచ్చని సర్కారు అంచనా వేస్తున్నది. అందులో భాగంగా హై క్వాలిటీ కోర్సులను గుర్తించి ఫోకస్​ పెట్టేలా 18 నుంచి 45 ఏండ్ల మధ్య ఉన్న వారికి ఏఐ ఫర్​ ఎంప్లాయ్​మెంట్​ స్కీమ్​ కింద శిక్షణ ఇవ్వనుంది. స్థానిక భాషల్లోనే కరికులం ఉండి అభ్యర్థులు నేర్చుకునేందుకు వీలు కల్పించనుంది.

దీనిని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్​ ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తుంటుంది. 2027 నాటికి 5 లక్షల మంది స్కిల్డ్​ యూత్​ను తయారు చేసి ఉపాధిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఆరు అంచెల విధానంలో వారికి శిక్షణ ఇవ్వనుంది. లీనియర్​ ఆల్జీబ్రా కాల్క్యులస్​, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్​, పైథాన్​ ప్రోగ్రామింగ్​, మెషీన్​ లెర్నింగ్​ ఇంట్రడక్షన్​, న్యూరల్​ నెట్​వర్క్స్​ డీప్​ లెర్నింగ్​, మోడల్​ ఎవాల్యుయేషన్​ ఆప్టిమైజేషన్​లపై శిక్షణ ఇస్తుంది. ఓపెన్​ నెట్​వర్క్​ ఫర్​ ఎడ్యుకేషన్​ స్కిల్లింగ్​ ట్రాన్సాక్షన్​ (ఓనెస్ట్​) ద్వారా కెరీర్​లో ఎదిగేలా చూస్తారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడినవాళ్లు, సామాజికంగా వెనుకబడినవాళ్లకూ దీంట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

లోకల్​ లాంగ్వేజ్​లో డేటా

మన భాషలో డేటా సెట్స్​ను, మోడల్స్​ను సర్కారు అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఉన్న డేటాసెట్స్​ ద్వారా ట్రాన్స్​లేట్​ చేసి.. మళ్లీ దానిని ఒరిజినల్​ లాంగ్వేజ్​లోకి మార్చడం పెద్ద టాస్క్​ అయిపోతున్నది. ఈ నేపథ్యం లోనే లోకల్​ లాంగ్వేజ్​(తెలుగు)లోనే డేటా సెట్స్​ను సిద్ధం చేసేలా ఏఐ సాంకేతికతను తీసుకురానుంది. మన సంస్కృతి, మన భాషలో తేడా లేకుండా సమర్థవంతంగా డేటాసెట్స్​ను తయారు చేసి ప్రజలకు అందించ నున్నారు.

ఇందులో భాగంగా మూడు స్థాయిల్లో దానిని ప్రాసెస్​ చేయనున్నారు. డేటా ప్రొటెక్షన్​ అండ్​ ప్రైవసీ చట్టానికి లోబడి ఇవన్నీ చేస్తారు. అందుకు తగ్గట్టు తెలుగు లాంగ్వేజ్​ మోడల్స్​, స్టాటిస్టికల్​ లాంగ్వేజ్​ మోడల్స్, ఆటోమేటిక్​ స్పీచ్​ రికగ్నిషన్​ వ్యవస్థలను సిద్ధం చేస్తారు. స్థానిక యూనివర్సిటీలు, ఇన్నొవేటర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 12 భాషల్లో నేచురల్​ లాంగ్వేజ్​ ప్రాసెసింగ్​ చేసే ఇండిక్​  బీఈఆర్​టీ మోడల్​ ఆధారంగా తెలుగు లాంగ్వేజ్​కు ప్రత్యేకంగా ఒక లాంగ్వేజ్​ మోడల్​ను తీసుకొస్తారు. చందమామ కథలను ‘స్వేచ్ఛ’ అనే ఏఐ మోడల్​ ద్వారా యానోటేట్​ చేసినట్టే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి యానోటేషన్​ చేయిస్తారు.