ఇప్పుడు AI యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోంది. IVF ట్రీట్మెంట్ లో కూడా AI తన సత్తా చాటుతోందని నిపుణులు అంటున్నారు. AI వల్ల IVF సక్సెస్ రేట్ పెరుగుతోందని ఇటీవల జరిపిన అధ్యనాల్లో తేలింది. IVF ట్రీట్మెంట్ లో AI ఉపయోగం వల్ల సక్సెస్ రేట్ పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. AI ఉపయోగించి సక్సెస్ రేట్ ఉన్న ఎంబ్రియోస్ సెలెక్ట్ చేయటంలో అక్యురసీ పెరుగుతుందని తేలింది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన కథనంలో కూడా హ్యూమన్ స్పెషలిస్ట్స్ తో పోలిస్తే ఎంబ్రియో సెలెక్షన్ లో AI టెక్నాలజీ సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. సమర్థవంతమైన వీర్యకణాలను, అండాలను గుర్తించటంలో AI కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు.దీన్ని బట్టి చూస్తే AI వినియోగం ఇంకా పెరిగితే, క్లినికల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ రెట్టింపయ్యే అవకాశం ఉంది.