AI Effect:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో యూకేలో లక్షల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. యూకే ప్రభుత్వ పాలసీల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 80 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (IPPR) హెచ్చరిస్తోంది. AI తో ఇప్పటికే 11 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది 60 శాతానికి పెరిగే అవకాశం ఉందంటున్నారు.
పార్ట్ టైమ్, ఎంట్రీ లెవెల్ , కస్టమర్ సర్వీస్ వంటి బ్యాక్ ఆఫీస్ ఉద్యోగులతోపాటు ఎక్కువ జీతాలు చెల్లించే ఉద్యోగులపై కూడా AI ప్రభావం ఉంటుందని పేర్కొంది. ప్రాడక్ట్ పెంచేందుకు తీసుకున్న నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గుచూపుతున్నందున ఉద్యోగుల్లో కోత తప్పదని వెల్లడించింది. వివిధ రంగాల్లో బిజినెస్ డెవలప్ మెంట్ కోసం యూకే కంపెనీలు AI ని ఉపయోగించుకుంటున్నాయి.
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఉద్యోగులకు నష్టం కలిగిస్తుందా.. మేలు కలిగిస్తుందా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని IPPR నివేదిక హైలైట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో 30 శాతం వరకు జీతాల్లో పెరుగుదల ఉండొచ్చని తెలిపింది.