- పైలట్ ప్రాజెక్టుగా శంకర్ పల్లి స్కూల్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ), మిషన్ లెర్నింగ్ ( ఎంఎల్ ) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ అకడమిక్ ఇయర్లో పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎస్సీ గురుకుల స్కూల్ ను ఎంపిక చేసి, క్లాసులు నిర్వహిస్తున్నారు. ర్యాస్ప్ బెర్రి పీఐ ఇంటర్నేషనల్ సంస్థ, నిర్మాణ్ ఎన్జీవో, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ( హైసియా) లు సీఎస్ఆర్ కింద వీటి నిర్వహణకు ముందుకు వచ్చినట్టు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి శనివారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.