రోజులు గడుస్తున్న కొద్దీ కృత్రిమ మేధ(ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం అధికమవుతోంది. లేని మనుషులు ఉన్నట్లుగా, ఉన్నవారిని సరికొత్తగా చూపిస్తూ.. ఏఐ భవిష్యత్తును మరింత కొత్తగా మారుస్తోంది. తాజాగా ఓ యూజర్.. తన సృజనాత్మకతకు కృత్రిమ మేధ సాయం జోడించి 1950లలో మన క్రికెటర్లు ఎలా ఉండేవారో చూపే దృశ్యాలు సృష్టించాడు. అవి నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్నాయి.
1950 అనగానే.. పాత సినిమాలను ఓసారి మనసులో ఊహించుకోండి. ఎక్కడా రంగురంగుల దృశ్యాలు కనిపించవు.. అంతా నలుపే! మన క్రికెటర్లు కూడా అచ్చం అలానే ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోమహల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ.. ఫ్రెంచ్ మీసకట్టుతో యవ్వనంలో యువరాజును తలపిస్తున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ రెట్రో లుక్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి..!