ఇక సర్కార్ బడుల్లో ఏఐ విద్య .. ఫిబ్రవరి 24 నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు

ఇక సర్కార్ బడుల్లో ఏఐ విద్య .. ఫిబ్రవరి 24 నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాల్లో 36 స్కూళ్లలో స్టార్ట్ 
  • 1–5 క్లాసుల విద్యార్థుల్లో కనీస   అభ్యర్థన సామర్థ్యాల పెంపు 
  • కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుతో పాటు ఏఐ సాఫ్ట్ వేర్ ఇన్​స్టాల్​

మెదక్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో ప్రాథమిక స్థాయిలో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యర్థన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్(ఏఐ) అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషనల్​లిటరసీ న్యూమర్సీ(ఎఫ్ఎల్ఎన్​) ప్రోగ్రామ్ కు చర్యలు తీసుకుంటోంది. 

ఇప్పటికే టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు టీచింగ్,​ లెర్నింగ్,​ మెటిరియల్​టెక్ట్స్​బుక్స్, వర్క్​బుక్స్, హ్యాండ్ బుక్స్​ముద్రించి సరఫరా చేసింది. ప్రస్తుతం అందుబా టులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఎఫ్ఎల్ఎన్​ప్రోగ్రామ్ మరింత మెరుగ్గా అమలు చేయనుంది. ఇందుకోసం రాష్ట్రంలో   పైలెట్​ ప్రాజెక్ట్​గా మెదక్, భద్రాద్రి, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి జిల్లాలు ఎంపిక అయ్యాయి.  ఒక్కో జిల్లాలో 6 ప్రైమరీ స్కూళ్ల చొప్పున మొత్తం 36 స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 

1–5 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి..

సెలెక్టైన స్కూళ్లలో కంప్యూటర్​ ల్యాబ్​లు ఏర్పాటు చేసి.. ఎక్స్​స్టెప్​ ఫౌండేషన్​ఏఐ లెర్నింగ్​టూల్స్ అయిన అసిస్టెడ్​లాంగ్వేజ్​లెర్నింగ్(ఏఎల్ఎల్), అసిస్టెడ్​మ్యాథమెటిక్​లెర్నింగ్​(ఏఎంఎల్​)ను  ఇన్​స్టాల్​చేస్తున్నారు. 1 – 5వ తరగతుల విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్​ ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్​ ముందు చదివితే ఎర్రర్స్​(లోపాలను) గుర్తిస్తుంది. తదనుగుణంగా టీచర్లు ఆయా విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అమలుకు సంబంధించి సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్​లు, టీచర్లు, కాంప్లెక్స్​హెడ్​ మాస్టర్లు, సీఆర్టీలు, ఏఎంఓలు, డీఈఓలకు జూమ్​ మీటింగ్​ద్వారా శిక్షణ ఇచ్చారు.  ఈనెల 24వ తేదీ నుంచి ఆయా స్కూళ్లలో ఏఐ ద్వారా ఎఫ్ఎల్ఎన్​ ప్రోగ్రామ్ అమలులోకి రానుంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన జిల్లాల్లో పైలట్ స్కూళ్లు ఇవే.. 

మెదక్ జిల్లాలో తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట మండల పరిషత్​ ప్రైమరీ స్కూల్స్​ఎంపికయ్యాయి. భద్రాద్రి జిల్లాలో హన్మాన్​బస్తీ, కేటీపీఎస్​ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్​, పాలకొయ్య తండా, ఓల్డ్​ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్​, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్​పల్లి, నారాయణపేట్​జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్, వికారాబాద్​ జిల్లాలో ఓల్డ్​తాండూరు(తెలుగు మీడియం), దౌల్తాబాద్​, కొట్​బాస్​పల్లి, రేగడ్​మేల్వేర్, మల్కాపూర్​గని, తాండూ‌‌‌‌ర్​(ఉర్దూ మీడియం) స్కూళ్లలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అమలు కానుంది. 

విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం

ప్రాథమిక విద్యార్థుల్లో కనీస అభ్యర్థన సామర్థ్యాల పెంపునకు ఇదివరకే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అమలులో ఉంది. అయితే.. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎంపికైన 6 ప్రైమరీ స్కూళ్లలో సోమవారం నుంచి అమలు చేస్తున్నాం. 

ఇందుకు ఆయా స్కూళ్లలో కంప్యూటర్లు సమకూర్చడంతో పాటు ఇప్పటికే  టీచర్లు, హెడ్ మాస్టర్లకు, కాంప్లెక్స్ సీఆర్టీలకు ట్రైనింగ్ ఇచ్చాం. విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడనుంది.  

- సుదర్శన్ మూర్తి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, మెదక్ జిల్లా -