తెలంగాణలో AI డెవలప్‌మెంట్‌కు 25 అంశాలతో రోడ్ మ్యాప్

తెలంగాణలో AI డెవలప్‌మెంట్‌కు 25 అంశాలతో రోడ్ మ్యాప్

తెలంగాణ రాష్ట్రంలో AI  డెవలప్‪మెంట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వనియోగం చేయొద్దని ఆయన సూచించారు. హైదరాబాద్‌ హైటెక్స్ లోని HICCలో గురువారం ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి కృతిమ మేధ అనే థీమ్ తో జరిగిన ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ధి చేయడానికి 25 అంశాలతో కూడిన రోడ్ మ్యాప్ ను రిలీజ్ చేశారు. 

రైల్ ఇంజిన్, టీవి, కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ దాకా వచ్చాయిన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది.. ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టబడిదారులను ఆహ్వానిస్తున్నామనం ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి AI రంగంలో పరిజ్ఞానం ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు.

హైదరాబాద్ లో 200 ఎకరాలు కేటాయించి ఏఐ సిటీని ఏర్పాటు చేస్తాము. రాబోయే మూడేళ్లల్లో గ్లోబల్ ఏఐ హబ్ గా హైదరాబాద్ అవతరిస్తుందని మంత్రి అన్నారు. ఏఐ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఉందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణులైన 2వేల మంది ఏఐ నిపుణులు సదస్సుకు వచ్చారు. 

Also Read :- విద్య, వైద్యంపై టాస్క్ ఫోర్స్