కోర్టులకు ఏఐ హెల్ప్.. మునుపటి తీర్పుల రిట్రీవల్కు ఐఐఐటీ హెచ్​ ‘యాంకర్​ టెక్స్ట్​’ టెక్నిక్​

కోర్టులకు ఏఐ హెల్ప్.. మునుపటి తీర్పుల రిట్రీవల్కు ఐఐఐటీ హెచ్​ ‘యాంకర్​ టెక్స్ట్​’ టెక్నిక్​
  • కోర్టుల్లో వాదనలకు సమర్థంగా పనిచేస్తుందంటున్న రీసర్చర్లు
  • చెక్​ రిపబ్లిక్​లో నిర్వహించిన సదస్సులో బెస్ట్​ పేపర్​గా అవార్డు

హైదరాబాద్, వెలుగు: కోర్టుల్లో వాదనలు వినిపించేందుకు సాక్షులు, వారి వాంగ్మూలాలు, కేసు వివరాలు ఎంత ముఖ్యమో.. అలాంటి కేసుల్లో కోర్టులు ఇచ్చిన గత తీర్పుల ప్రస్తావన కూడా అంతే ముఖ్యం. అలాంటి తీర్పులను ఫిజికల్​గా సంపాదించడం, వాటిలోని ముఖ్యాంశాలను తీసుకోవడం కొంచెం కష్టమైన పనే. కేసులకు పాత తీర్పుల్లోని సైటేషన్లను ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు ఇంటర్నేషనల్​  ఇన్ స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ హైదరాబాద్​ (ఐఐఐటీ హెచ్​) రీసర్చర్లు. 

అయితే, ఆయా సైటేషన్ ​లోని ఫ్రేజులు, పేరాలు, వాక్యాల ఆధారంగా ఇప్పటిదాకా ఏఐ ద్వారా గత తీర్పులను రిట్రీవ్​ చేస్తున్నా.. అందుకు భిన్నంగా ఐఐఐటీ హెచ్​ రీసర్చర్లు ‘యాంకర్​ టెక్స్ట్​’ను దీని కోసం వాడుకున్నారు. ప్రొఫెసర్​ పి.కృష్ణారెడ్డి నేతృత్వంలో సెకండియర్​ ఎంఎస్​ రీసర్చ్​ స్టూడెంట్​ గౌరంగ్​  పాటిల్ .. యాంకర్​ టెక్స్ట్​ ద్వారా గత తీర్పులను ఏఐ సాయంతో రిట్రీవ్​ చేసి సక్సెస్​ అయ్యారు. ‘సైటేషన్​ యాంకర్​ టెక్స్ట్​ ఫర్​ ఇంప్రూవింగ్​ ప్రిసిడెంట్​ రిట్రీవల్​: యాన్​ ఎక్స్​పరిమెంటల్​ స్టడీ ఆన్​ ఇండియన్​ లీగల్​ డాక్యుమెంట్స్’ పేరిట ఆయన రీసర్చ్​ చేశారు. ఈ రీసెర్చ్​ పేపర్​ను కొద్ది నెలల క్రితం చెక్​ రిపబ్లిక్​లో నిర్వహించిన 37వ ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆన్​ లీగల్​ నాలెడ్జ్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​ సదస్సుకు సమర్పించారు. గౌరంగ్​ పాటిట్​ సమర్పించిన ఈ రీసర్చ్  పేపర్​కు ‘బెస్ట్​ పేపర్​ అవార్టు’ లభించింది. 

ఏంటీ యాంకర్  టెక్స్ట్​

ఓ వెబ్​ పేజీకి సంబంధించి పూర్తి యూఆర్ఎల్​కు బదులుగా.. కావాలనుకున్న వెబ్​ పేజీని డైరెక్ట్​గా ఓపెన్​ చేయడమే హైపర్​ లింక్​ టెక్స్ట్​ యాంకర్​ టెక్ట్స్​ అని గౌరంగ్​ పాటిల్​ తెలిపారు. 1990, 2000 దశకాల్లో ఈ యాంకర్​ టెక్స్ట్​ వాడకం ఎక్కువగా ఉన్నదని, దీనిని వాడుకుంటే వెబ్​ సెర్చింగ్​ మరింత సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. దానిని లీగల్​ డొమెయిన్​లో వాడుకుంటే మరింత సమర్థవంతమైన ఫలితాలను సాధించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. 

 గౌరంగ్  తన ప్రయోగంలో భాగంగా ఇప్పటికే  సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పుల్లోని కొన్ని పదాలు, టెక్స్ట్​లను తీసుకుని డేటా సెట్స్​ను తయారు చేశారు. ప్రస్తుతమున్న విధానాలతో పోలిస్తే యాంకర్​ టెక్స్ట్​ టెక్నిక్​ ద్వారా మరింత సులభంగా ఆయా తీర్పులను రిట్రీవ్​  చేయగలిగామని ఆయన తెలిపారు. ఈ టెక్నిక్​ను మరింత అభివృద్ధి చేసే దిశగా తమ పరిశోధనలను కొనసాగిస్తామని చెప్పారు.