రైల్వే లైన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించండి : దుడ్డు గంగాధర్

రైల్వే లైన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించండి : దుడ్డు గంగాధర్

మాక్లూర్, వెలుగు : పెద్దపల్లి రైల్వే లైన్​లో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు  స్థలాలిచ్చి ఇండ్లు  కట్టించాలని   ఏఐ కేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్డట్ పల్లి గ్రామంలో  పెద్దపల్లి  రైల్వే లైన్ ఎస్సీ వాడకు చెందిన 28  ఇండ్లు  పోతున్న  అందరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం  డబుల్ బెడ్ రూమ్​లు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.   

పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు డబుల్​లైన్ ఏర్పాటు కోసం  సర్వే నడుస్తుందని, ఓడాటిపల్లి గ్రామానికి చెందిన మరో 20   ఎస్సీ వాడకు  చెందిన    20 కుటుంబాలు రోడ్డున పడతాయని   వాపోయారు.  ఈ ప్రభుత్వం దృష్టి సారించి తమకు ఇండ్లు కట్టివ్వాలని కోరారు. కుంటే బాధితులతో కలిసి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.