
మెదక్, వెలుగు: ప్రైమరీ స్టూడెంట్స్‌లో కనీస అభ్యర్థన సామర్థ్యాల పెంపు కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ల్యాబ్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. తూప్రాన్, మాసాయిపేట్, బూరుగుపల్లి స్కూల్స్‌లో ఏఐ ల్యాబ్స్ ను డీఈవో రాధ కిషన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏఐ ప్రోగ్రామ్ అమలు కోసం మెదక్ జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు.
జిల్లాలో ఎంపిక చేసిన 6 స్కూల్స్‌లో 10 నుంచి 15 మంది స్టూడెంట్స్‌ను ఎంపిక చేసుకొని వారికి ఏఐలో అవగాహన కల్పిస్తామన్నారు. ఒక నెల తర్వాత మరికొన్ని స్కూల్స్‌లో ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్, నిజాంపేట్, మాసాయిపేట్ నర్సాపూర్, మనోహరాబాద్, తూప్రాన్ ఏంఈవోలు పాల్గొన్నారు.