6 నెలల్లో ఇండియా సొంత ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌..సర్వం ఏఐ ఫౌండర్ల హామీ

6 నెలల్లో ఇండియా సొంత ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌..సర్వం ఏఐ ఫౌండర్ల హామీ
  • 400 జీపీయూలను కంపెనీకి కేటాయించనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: లైట్‌‌స్పీడ్ వెంచర్ క్యాపిటల్‌‌కు వాటాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ)  కంపెనీ సర్వం ఏఐ మరో  ఆరు నెలల్లో ఇండియాలో డెవలప్ అయిన మొదటి జెన్‌‌ ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌ను అందుబాటులోకి తెస్తుందని కంపెనీ ఫౌండర్ ప్రత్యూష్‌‌ కుమార్ పేర్కొన్నారు.  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఇండియాకు చెందిన  మొదటి జెన్‌‌ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌గా  సర్వం ఏఐ నిలుస్తుందని అన్నారు. ప్లాట్‌‌ఫామ్‌‌ను ఎంత టైమ్‌‌లో డెవలప్ చేస్తారని  ఆయన అడగగా,  సర్వం వ్యవస్థాపకులు ఆరు నెలల్లో  పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని 7,000 కోట్ల పారామీటర్లతో  డెవలప్ చేయడానికి ఆరు నెలల పాటు 400 జీపీయూలను ప్రభుత్వం కేటాయిస్తుంది.