Fack Check : షారూఖ్, సల్మాన్ కుంభమేళాకు వెళ్లారా.. ఇందులో నిజమెంత..?

Fack Check : షారూఖ్, సల్మాన్ కుంభమేళాకు వెళ్లారా.. ఇందులో నిజమెంత..?

దేశం మొత్తం కుంభమేళా పవిత్ర స్నానాలతో పులకించిపోతుంది.. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ.. భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందుతున్నారు. కుంభమేళాలో ఎన్నో చిత్రాలు, విచిత్రాలు.. దేశ, విదేశాల నుంచి ఇతర మతస్తులు సైతం కుంభమేళాకు వస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

బాలీవుడ్ ప్రముఖ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ కుంభమేళాకు వచ్చినట్లు.. వాళ్లిద్దరూ పవిత్ర స్నానం చేసినట్లు.. వాళ్లిద్దరూ మెడల్లో దండలు, నుదుటన విభూధి.. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షారూఖ్, సల్మాన్ ఖాన్ కుంభమేళాకు వచ్చారా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే వాళ్లిద్దరూ హిందూయేతర మతస్తులు కావటం.. మరింత చర్చకు దారి తీసింది. 

Also Read :- నాగ చైతన్య vs సాయి పల్లవి రెమ్యున‌రేష‌న్

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని లోతుగా పరిశీలించగా.. నిజానిజాలు ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది.. ఈ ఫొటోలు AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసినవి అని.. ఈ ఫొటోలు నిజం కాదు.. షారూఖ్, సల్మాన్ కుంభమేళాకు రాలేదు అని స్పష్టం అయ్యింది. కొందరు నెటిజన్లు.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి.. షారూఖ్, సల్మాణ్ ఖాన్ పుణ్యస్నానాలు చేస్తున్నట్లు క్రియేట్ చేసిన ఫొటోలు ఇవి. వాళ్లిద్దరూ కుంభమేళాకు అస్సలు రాలేదు అని స్పష్టం అయ్యింది. యూపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఫొటోలు నకిలీ అని.. కొందరు ఆకతాయిలు సృష్టించినవి అని నిర్థారణ అయ్యింది. మీరు కూడా నమ్మకండి..