AI పిన్ : ఏది పడితే అది రికార్డ్ చేస్తుందా.. భయపడుతున్న ప్రపంచం

AI పిన్ : ఏది పడితే అది రికార్డ్ చేస్తుందా.. భయపడుతున్న ప్రపంచం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిన్.. సింపుల్ గా AI పిన్. స్మార్ట్ ఫోన్లను కనుమరుగు చేయటానికి.. అత్యంత వేగంగా వస్తున్న బుల్లి చిప్.. ఇందులోనే అంతా ఉంటుంది. ఫోన్ చేసుకోవచ్చు.. మాట్లాడుకోవచ్చు.. మొత్తం ఇంటర్నెట్ కు అనుసంధానిస్తూ.. మన స్మార్ట్ ఫోన్ కంటే అత్యంత వేగంగా పని చేస్తుంది. జస్ట్ మన చొక్కాకు నేమ్ ప్లేట్ పెట్టుకున్నట్లు.. ఈ AI పిన్ పెట్టుకుంటే చాలు. ఈ పిన్ లో అత్యంత శక్తివంతమైన కెమెరా కూడా ఉందంట.. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది.

మనకు తెలియకుండా మన ఫొటోలు తీస్తారు.. మనకు తెలియకుండా మన సమాచారం అంతా రికార్డ్ చేస్తుంది.. అత్యంత సున్నితమైన, రహస్యమైన విషయాలను సైతం వినేస్తుంది.. చూస్తుంది.. రికార్డ్ చేస్తుంది.. మాటలు వింటుంది.. ఇదే ఇప్పుడు ప్రపంచంలోని అందర్నీ భయపెడుతుంది. AI పిన్ లోని కెమెరా విషయంలో వస్తున్న సందేహాలపై వివరణ ఇచ్చారు సృష్టికర్త ఇమ్రాన్ చౌదరి.. అదేంటో చూద్దాం..

AI పిన్ మనకు అనుకున్నట్లే పని చేస్తున్నా.. దానికి కొన్ని కమాండ్ కంట్రోల్స్ ఇవ్వాలంట. కెమెరా రికార్డింగ్ ఆన్ చేయాలంటే పిన్ ను రెండు సార్లు నొక్కాలంట.. అదే విధంగా స్వయిప్ చేయాలి. అంతే కాకుండా ట్రస్ట్ లైట్ అనే బటన్ నొక్కినప్పుడు మాత్రమే అది పని చేస్తుందంట. ఇదంతా కంపెనీ నియంత్రణలో ఉంటుందంట.. మనం రికార్డ్ చేస్తున్న ఫొటోలు, వీడియో, ఆడియోల్లో ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినా.. అసభ్యకరంగా ఉన్నట్లు కనిపించినా.. తప్పుగా జరుగుతున్నట్లు అనిపించినా అది రికార్డ్ కాదంట.. ట్రస్ట్ లైట్ వెలిగిన తర్వాత కూడా మనం చేసే రికార్డ్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు కంపెనీ తీసుకున్నట్లు వెల్లడించారు ఇమ్రాన్ చౌదరి..