ZinterviewAI: ఇంటర్వ్యూ లకోసం స్పెషల్ AI ..రిక్తం గ్రూప్ జెడ్ ఇంటర్వ్యూ ఏఐ

 ZinterviewAI: ఇంటర్వ్యూ లకోసం స్పెషల్ AI ..రిక్తం గ్రూప్ జెడ్ ఇంటర్వ్యూ ఏఐ

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల నియామకాల్లో ఇబ్బందులను తొలగించేందుకు రిక్తం గ్రూప్  జెడ్ ఇంటర్వ్యూ  ఏఐను తీసుకొచ్చింది. ఈ ఏఐ ఆధారిత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ఆటోమేటెడ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇది హెచ్ఆర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కంపెనీ తెలిపింది. 

హైదరాబాద్​లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జెడ్‌‌‌‌ ఇంటర్వ్యూ ఏఐ ఫౌండర్​, సీఈవో   సిద్ధరామ్ శింగశెట్టి మాట్లాడుతూ ఏఐను ఉపయోగించి నియామకాలను సులభతరం చేస్తున్నామని చెప్పారు. 

తమ ప్లాట్​ఫారమ్​ ద్వారా కంపెనీలు సమయాన్ని, వనరులను ఆదా చేసుకోవచ్చని తెలిపారు. గత పదిహేనేళ్ళుగా రిక్తమ్ టెక్నాలజీ కన్సల్టింగ్ ప్రపంచవ్యాప్తంగా టయోటా, నైకి, గూగుల్, ప్రాక్టర్ అండ్​ గాంబుల్ వంటి ప్రముఖ కంపెనీలకు కన్సల్టింగ్ సేవలు అందిస్తోందని తెలిపారు. 

సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం ఇప్పటికీ సమస్యగా ఉందని, దీనికి తమ ప్రొడక్ట్​ పరిష్కారం చూపుతుందని సిద్ధరామ్​వివరించారు.