తెలుగు యూట్యూబ్‌లోకి వచ్చేసిన AI యాంకర్స్

తెలుగు యూట్యూబ్‌లోకి వచ్చేసిన  AI యాంకర్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యాంకర్స్ ను క్రియేట్ చేసి.. వార్తలు చదివించేస్తున్నాం అంటూ టీవీ వాళ్లు అంటుంటే.. వాటిని మించి లేటెస్ట్ ఏఐ టెక్నాలజీలను ఉపయోగించి.. వీడియోలు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ ఛానెల్స్ హడావిడి చేస్తున్నాయి. జస్ట్ యాంకర్స్ మాత్రమే కాదు.. కంటెంట్ రాయడం, వీడియో ఎడిటింగ్, నేచురల్ వాయిస్ ట్రైనింగ్, తంబ్ నైల్ డిజైన్ ఇలా అన్నింటినీ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేసేస్తున్నారు తెలుగు యూట్యూబర్స్. 

జస్ట్ కంటెంట్ రాసుకుని.. వీడియో నుంచి ఇమేజ్ వరకు.. కావాల్సిన అన్ని  గ్రాఫిక్స్‍ను AI ద్వారా తయారు చేసుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టేశారు తెలుగు యూట్యూబర్స్. అలాంటి వీడియోల్లో ఒకటి బీటెక్ పిల్ల ఛానెల్ లోని ఓ వీడియో. జస్ట్ స్క్రిప్ట్ రాసుకుని.. దాన్ని AIకు లింక్ చేయటం ద్వారా.. మొత్తం వీడియో క్రియేట్ అయిపోయిందనే విషయం వీడియో చూడగానే అర్థం అయిపోతుంది. ఇక AI యాంకర్ మాట్లాడిన విధానం, ముఖకదలికలు గమనిస్తే ఇది Leonardo లేదా mid journey వంటి AI టూల్స్ ఉపయోగించి చేశారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

యాంకర్ ని ఏఐ ద్వారానే జనరేట్ చేసి, దానికి వాయిస్ సైతం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ద్వారా జోడించి.. తమ ఆలోచనలకు తగ్గట్టు క్రియేట్ చేయటం అనేది నిజంగా ఆశ్చర్యం. అది కూడా యూట్యూబ్ ఛానెల్స్ నుంచి క్వాలిటీ కంటెంట్ తో రావటం విశేషంగా చెప్పాలి. ఈ వీడియోలు వంద శాతం రియల్ యాంకర్ చేసినట్టు లేనప్పటికీ.. ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటున్నాయి. భవిష్యత్తులో డిజిటల్ మీడియా రంగంలో రాబోయే మార్పులకు ఇది మొదలు అని టెక్నాలజీ నిపుణులు అంటుంటే.. కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. అయితే తెలుగులో ఇలాంటి ట్రెండ్ మొదలు కావడం అనేది మంచి విషయంగానే చెప్పాలి. 

ప్రస్తుతం తెలుగు డిజిటల్ రంగంలో ప్రతి దానికీ.. ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల సాయంతో నెటిజన్లకు అవసరం అయిన కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయి. డిజిటల్ రంగంలో ప్రస్తుతం ఓ ఆర్టికల్ లేదా వీడియో పబ్లిష్ కావాలంటే కనీసం నాలుగు విభాగాలు పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా లేదు.. కంటెంట్ రాసినోళ్లకు టెక్నాలజీపై అవగాహన ఉంటే.. జస్ట్ గంట, గంటన్నరలో  మూడు, నాలుగు నిమిషాల వీడియో కంటెంట్ ను.. ఆర్టిఫిషియల్ యాంకర్ ద్వారా అందించేస్తున్నారు. ఓ ఐటీ మహిళా ఉద్యోగి.. బీటెక్ పిల్ల పేరుతో ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ AI వీడియో రిలీజ్ చేసింది. మార్కెట్లో చాలా ఉన్నా.. కొంచెం క్వారిటీ కంటెంట్ తో.. ఓ యూట్యూబర్ క్రియేట్ చేయటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. 

అందుబాటులో ఉన్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మార్కెట్లోకి ప్రతి రోజూ కొత్తగా వస్తున్న ఏఐ ఆప్షన్స్ ఉపయోగించి.. ఇంట్లోనే ఉండి.. వీడియో తయారు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు ఈ ఏఐ యాంకర్లు, వీడియోలు పూర్తి స్థాయిలో వ్యవస్థలను మార్చేఅవకాశం లేదు కానీ.. భవిష్యత్తులో మార్పులు చాలా వేగంగా  జరుగుతాయనడంలో ఏ సందేహం లేదు. అది కూడా ఎంతో కాలం కాదు.. జస్ట్ ఏడాదిలోనే అనేది.. ఓ యూట్యూబర్ చేసిన వీడియోనే సాక్ష్యంగా చెబుతోంది. ఇక మారాల్సింది మనమే.