AI లో ఇంటెల్ భారీ పెట్టుబడులు.. ప్రతి ప్రాడక్ట్ లోనూ AI చేర్చాలని నిర్ణయం..

AI లో ఇంటెల్ భారీ పెట్టుబడులు.. ప్రతి ప్రాడక్ట్ లోనూ AI చేర్చాలని నిర్ణయం..

మేధో ప్రపంచంలో ఇప్పుడు AI  హవా కొనసాగుతోంది.  పెద్ద పెద్ద కంపెనీలు AI లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా ఇంటెల్ తమ ప్రతి ప్రాడక్ట్ లోAI ని చేర్చాలని నిర్ణయించింది. మరోవైపు పెరిగిన  AI డిమాండ్ తో TSMC మైక్రోచిప్ తయారీకి కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించింది. మేధో ప్రపంచంలో  AI  గురించి కొన్ని లేటెస్ట్  ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ) లో ఇంటెల్ తన పెట్టుబడులను విస్తరించింది.  ఈ సాంకేతికతను ప్రతి ఉత్పత్తిలో వినియోగించాలని ప్రణాళికలు ప్రకటించింది. ది వెర్ట్ నివేదక ప్రకారం ..ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్  భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో కంపెనీ మెటోర్ లేక్ చిప్ ను ప్రారంభించనుంది. ఇందులో అంతర్ నిర్మిత న్యూరల్ ప్రాసెసర్ ఉంటుంది. 

తైవాన్ లో TSMC కొత్త రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం 
అభివృద్ధి చెందుతున్న ఏఐని వినియోగించుకునేందుకు తైవాన్ లో TSMC కొత్త రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభించింది. 2 నానో మీటర్ల ఉత్పత్తిలో సాంకేతికతను అభివృద్ధి చేసే పరిశోధకులకు  ఏఐ సహాయ ఉపయోగపడుతుందని TSMC వెల్లడించింది. చిన్న చిప్ ల తయారీలో ఇది సహాయపడుతుందని తెలిపింది. 

లాభాలకోసం AIని వినియోగిస్తున్న 73 శాతం మంది సిస్ అడ్మిన్లు 
 Sysadmin లపైAI ప్రభావంపై 2023లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 73 శాతం Sysadmin లు తమ కంపెనీలు లాభాలను పెంచుకునేందుకు AIని ఉపయోగించుకునే విషయంలో ఎలాంటి సందేహం లేదని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 560 మంది ఐటీ అడ్మినిస్ట్రేటర్ల తెలిపిన వివరాల ప్రకారం.. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మానవ ప్రాముఖ్యతను గుర్తిస్తూనే.. అనాలిసిస్ , ప్యాచ్ మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలపై AI ప్రభావం ఉంటుందని తేలింది. 

AI  చిప్ ల ఎగుమతికి వ్యతిరేకంగా నిబంధనలు కఠినతరం చేయాలని యూఎస్ లో ర్యాలీ 
రాయిటర్ నివేదిక ప్రకారం.. AI  చిప్ ల ఎగుమతికి వ్యతిరేకంగా నిబంధనలు కఠినతరం చేయాలని యూఎస్ చట్ట సభ సభ్యులు అధ్యక్షుడు బైడెన్ కోరారు. ఇంటెల్, ఎన్విడియా వంటి యూఎస్ కంపెనీలు తయారు చేసిన AI  చిప్  లకు చైనా యాక్సెస్ ను నియంత్రించాలని  ప్రతినిధులు రాజా కృష్ణమూర్తి, మైక్ గల్లాఘర్ యూఎస్ ప్రభుత్వాన్ని కోరారు.