
యూట్యూబ్‌లో వీడియోని మీ సొంత భాషలో వినడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుందా? అంటే అవును. ఏఐ ఎనేబుల్డ్ మల్టీ లాంగ్వేజ్ డబ్బింగ్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది. దీన్ని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఎలెవెన్ ల్యాబ్స్ డెవలప్ చేసింది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో వీడియోలు తయారుచేయొచ్చు. నచ్చిన భాషను జోడించొచ్చు. కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ చేసే వీడియోలను ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేయొచ్చు.
ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. భాష మారినా, వాయిస్ మారదు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గొంతుతోనే ఇతర భాషల్లోనూ వినిపిస్తుంది. ఇది నిజంగా వ్యూయర్లను సర్ప్రైజ్ చేసే విషయమే. దీనికోసం ఒరిజినల్ స్పీకర్ వాయిస్, టోన్‌ను అలాగే ఉంచి, వివిధ భాషల్లో ఆడియోను అందించేలా టెక్నాలజీ డెవలప్ చేశారు. దీంతో చూసేవాళ్లకు వీడియోలో ఉన్న వ్యక్తి తమ సొంత భాషలోనే మాట్లాడుతున్న ఫీల్ కలుగుతుంది. అందుకే దీన్ని ముద్దుగా రోబోటిక్ వాయిస్ అంటున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఇందుకోసం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆటో డబ్బింగ్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.