మీరు AI వచ్చా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా.. అయితే మీకు పుష్కలంగా అవకాశాలున్నాయి. సంవత్సరానికి 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్నాయి టెక్ కంపెనీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణుల కోసం 2024 ఫిబ్రవరి నెలలో AI జాబ్ ఆఫర్లు 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదలే ఇందుకు నిదర్శనం.
నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదికల ప్రకారం.. మెషీన్ లర్నింగ్ ఇంజనీర్, ఫఉల్ స్టాక్ AI సైంటిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగ ఆఫర్లు గతేడాది తో పోల్చుకుంటే 100 శాతం ,గత ఫిబ్రవరితో పోల్చుకుంటే 44 శాతం పెరిగాయి. IANS నినవేదిక ప్రకారం.. మెట్రో నగరాలతోపాటు నాన్ మెట్రో నగరాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న కొత్త ప్రతిభకు డిమాండ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 2024లో రాయఫ్ పూర్ లాంటి మెట్రోయేతర నగరాల్లో గతేడాది 14 శాతం వృద్ధితో కొత్త ఉద్యోగాల సృష్టించగా.. సూరత్, జోథ్ పూర్, గాంధీనగర్ లు వరుసగా 12శాతం, 10 శాతం, 8 శాతం వృద్ధిని సాధించాయి.
16 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్ నిపుణులు గరిష్ట జాబ్ ఆఫర్లను పొందారు. సంవత్సరానికి 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో ఫిబ్రవరి 24 లో జాబ్ ఆఫర్ల 23శాతం పెరిగాయి.