
గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో ఏఐ సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ విషయమై గూగుల్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని ప్రకారం గూగుల్ ట్రాన్స్లేషన్ వాడేటప్పుడు అదనంగా మరికొన్ని ప్రశ్నలు అడిగేందుకు వీలు కల్పించనుంది. తద్వారా కస్టమైజ్ చేసిన ట్రాన్స్‌లేషన్‌ని టెక్స్ట్ ప్రాంప్ట్‌లుగా కూడా వాడుకోవచ్చు. దాంతోపాటు ట్రాన్స్లేషన్కి ఫీడ్ బ్యాక్ కూడా చిటికెలో ఇవ్వొచ్చు.
మొదట ఈ ఏఐ ఫీచర్స్‌ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఒక వీడియోని షేర్ చేసింది కంపెనీ. ఆ వీడియోలో గూగుల్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కింద వైపు ‘ఆస్క్ ఫాలో అప్’ అనే ఆప్షన్ చూపిస్తుంది. అంటే మొదటి ట్రాన్స్లేషన్ తర్వాత దానికి సంబంధించి ఇంకేమయినా ఉంటే అందులోనే కంటిన్యూ చేయమని అర్థం. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ట్రాన్స్‌లేషన్‌ని మెరుగుపరచడానికి, కస్టమైజ్ చేయడానికి ఏఐ పవర్డ్ ఫీచర్లు అనుమతిస్తాయి.
బటన్ క్లిక్ చేశాక ట్రాన్స్లేషన్కి సంబంధించి అదనపు సమాచారం కూడా కనిపిస్తుంది. అదేంటంటే.. ట్రాన్స్లేషన్ చేస్తున్న సమాచారంలో తప్పుల్లేకుండా పూర్తి చేసేందుకు ఏమైనా పదాలు వాడాలా? అని అడుగుతుందన్నమాట. ఇలా ట్రాన్స్‌లేషన్‌ని కస్టమైజ్ చేసుకునేందుకు రకరకాల బటన్స్ పాప్ – అప్ అవుతాయి. అందులో ఫార్మల్, సింప్లిఫై, క్యాజువల్, ఆల్టర్నేటివ్ ట్రాన్స్‌లేషన్స్, రీఫ్రేజ్, రీజినల్ వేరియంట్స్ వంటివి అనేకం ఉంటాయి. ఒక్కోటి ఒక్కో అంశానికి పనికొస్తుంది. వీటిని వాడడం వల్ల ట్రాన్స్లేషన్ చదివేందుకు వీలుగా అర్థవంతమైన పేరాలాగ తయారవుతుంది. అంతేనా.. స్పీకర్ ఐకాన్ ద్వారా కూడా ట్రాన్స్లేషన్ చేయొచ్చు. దానివల్ల పదం ఎలా పలకాలో కూడా తెలుస్తుంది. ఒకవేళ ట్రాన్స్లేషన్ నచ్చకపోతే థంబ్స్ డౌన్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు.