వయసు పరిణామ క్రమంపై AI వీడియో సృష్టి.. భయంగా ఉంది..కానీ అందంగా ఉంది

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ వీడియో లేదా ఇన్ఫర్మేషన్ తో ఫాలోవర్లను కట్టిపడేసే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా .. ఇటీవల ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి వయసు క్రమంగా పెరుగుతూ వస్తోంది. చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు ఆమె ముఖం ఎలా మారుతుందో ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ క్లిప్‌ వయస్సులోని వివిధ దశలను వివరిస్తుంది. దీనంతటికీ కారణం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI సాయంతో జరిగిన ఈ అద్భుతానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...  హాంటింగ్లీ బ్యూటీఫుల్ అంటే భయంగా ఉంటుంది కానీ అందంగా ఉంటుందంటూ క్యాప్షన్ ను జోడించారు.

ఈ వీడియోను షేర్ చేసే క్రమంలో.. 'కృత్రిమ మేధస్సు నుంచి రూపొందించబడిన ఈ పోర్ట్రెయిట్‌ల పోస్ట్‌ను తాను కనుగొన్నానని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి 5 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వయస్సు వరకు ఆమె ముఖంలో వచ్చే మార్పులను చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 8 లక్షల వ్యూస్ రాగా,  దాదాపు 1700 రీట్వీట్లు , సుమారు 80 మంది కోట్‌లను ట్వీట్ చేశారు. దాదాపు 14 వేల మంది ఈ ట్వీట్‌ను లైక్ చేశారు. ఈ వీడియోపై ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే చాలా మంది AI గురించి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. AI అందంగా ఉంది. ప్రపంచాన్ని మార్చే శక్తి దానికి ఉంది. దానికి కావలసిందల్లా కొంత నియంత్రణ. దాని సామర్థ్యం అపరిమితంగా ఉంటుంది.. అంటూ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. ఇది మానవ మేధస్సును భర్తీ చేస్తుందని  భయపడుతున్నానని,  ప్రపంచంలో ఉద్యోగ సంక్షోభం కూడా ఉండవచ్చు అంటూ ఇంకొందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/anandmahindra/status/1650497963624366083