సూర్య కంగువలో ఏఐ టెక్నాలజీ.. 8 భాషల్లో సూర్య వాయిస్

సూర్య కంగువలో ఏఐ టెక్నాలజీ.. 8 భాషల్లో సూర్య వాయిస్

స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమా కంగువపై భారీ అంచనాలున్నాయి. వీఎఫ్‍ఎక్స్‌తో ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంగా రూపొందింది. డిఫరెంట్ టైమ్‍లైన్లలో ఈ మూవీ సాగుతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌తో హైప్ బాగా పెరిగింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న విడుదల కానుంది.  ఇదిలా ఉండగా ఈ సినిమాను 8 భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. 

నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో ఈ మూవీ విడుదలవుతుందని తెలిపారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, ఫ్రెండ్, స్పానిష్‍లో వస్తుందని నిర్మాత జ్ఞానవేల్ వెల్లడించారు. ఈ సినిమాలో సూర్య వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తమిళం కాకుండా వేరే భాషల్లో సూర్య వాయిస్ కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్‌లను వాడకుండా ఏఐను టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిపారు. 

అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీ సాయంతో ప్రతీ భాషలో సూర్య వాయిస్‍ను రీక్రియేట్ చేసే పనిలో కంగువ టీమ్ నిమగ్నమైంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులతో పని లేకుండా ఇతర భాషల్లో సూర్య వాయిస్ ఏఐ ద్వారా ఉండనుంది. ఇది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటించారు. విలన్‍గా బాబీ డియోల్ యాక్ట్ చేశాడు. నటరాజన్ సుబ్రమణియం, కిచ్చా సుదీప్, జగపతి బాబు, రెడిన్ కింగ్‍స్లే, యోగిబాబు, కోవై సరళ, చక్రవర్తి, ఆనంద్‍రాజా కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందిందని అంచనా.