టీబీ ఉందో లేదో .. ఏఐ ఒక్క చెస్ట్ ఎక్స్రే తో తేలుస్తది

 టీబీ ఉందో లేదో .. ఏఐ ఒక్క చెస్ట్ ఎక్స్రే తో తేలుస్తది
  • టీబీ లేదని చెప్పడంలో 97 శాతం కచ్చితత్వం

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ కిమ్స్​హాస్పిటల్​లో మానవ ప్రమేయం లేకుండా ఏఐ టూల్​తో టీబీని నిర్ధారించారు.16,675 మందికి సంబంధించిన చెస్ట్ ఎక్స్ రేలను క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉప‌యోగించి టీబీ ఉందో లేదో విశ్లేషించారు. టీబీ ఉన్నట్లు 88.7%, లేదని 97% క‌చ్చితత్వంతో రిపోర్టులు వచ్చాయని పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ తెలిపారు.

 వ్యాధిని త్వరగా గుర్తించ‌డంలో ఏఐ కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని నిర్ధార‌ణ అయ్యిందని ఆమె వెల్లడించారు. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1 శాతంగా  ఉందని, డ‌బ్ల్యుహెచ్ఓ) ప్రమాణాల‌ను ఇది అందుకుంటోందని పేర్కొన్నారు. ఏఐ గుర్తించిన కేసుల‌న్నింటినీ నిపుణులైన రేడియాల‌జిస్టులు కూడా నిర్ధారించారన్నారు. టీబీ గుర్తింపులో ఏఐ టూల్​గేమ్ ఛేంజ‌ర్ కానుంది అన్నారు.