70 శాతం ఇండియన్ ఐటీ ఉద్యోగులపై AI ప్రభావం: HCL మాజీ సీఈవో

70 శాతం ఇండియన్ ఐటీ ఉద్యోగులపై AI ప్రభావం: HCL మాజీ సీఈవో

టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2024లో మరింత పెరుగుతాయని..పెద్దపెద్ద టెక్ కార్పొరేషన్ల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్ని స్థాయిల్లో తొలగింపులతో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 2024 మొదటి రెండు నెలల్లో 193 కంపెనీలు దాదాపు 50వేల మంది సిబ్బందిని తొలగించాయి. మార్చి 2024 మొదటి వారంలో ఏడు కంపెనీలు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించాయి. అయితే లేఆఫ్స్ లకు ప్రధాన కారణం AI అని.. Copilot, Chat GPT వంటి ఏఐ సాధనాల కారణంగా రాబోయే రోజుల్లో ఉద్యోగులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని వ్యాపారవేత్త, HCL మాజీ సీఈవో వినీత్ నాయర్ అంటున్నారు. 

ChatGPT, Gemini, Copilot  వంటి ఉత్పాదతక AI సాధనాల రాక కారణంగా అనేక పరిశ్రమలు ప్రస్తుతం మేక్ ఓవర్ మధ్యలో ఉన్నాయి. AI తో కొనసాగుతున్న పరిశ్రమల్లో ఐటీ ఒకటి.. ఈ పరిశ్రమలో ఉద్యోగాలు, రిక్రూట్ మెంట్లపై  AI ప్రభావం నిస్సందేహంగా ఉంటుందంటున్నారు వినీత్ నాయర్. ఇండియన్ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న 70 శాతం టెకీలపై AI ప్రభావం చూపబోతుందన్నారు. 

AI  సాధనాలు మనుషులకంటే ఎక్కువగా పనిచేస్తున్నందున ఇది భారతీయ ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతుంది. కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించేందుకు కారణమవుతుంది. అయితే ఉద్యోగులను తొలగించడమనేది అనైతికం.. ఇది ఇండియణ్ ఐటీ భవిష్యత్తకు ప్రమాదం అని హెచ్చరించారు. 

తొలగించవద్దు.. ఉద్యోగుల్లో స్కిల్స్ పెంచాలి 

అనుభవం ఉన్న ఉద్యోగులను వదిలివేయడం, తాజా గ్రాడ్యుయేట్ లకు శిక్షణ ఇవ్వడం.. వంటి చర్యలకు కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. ఇది సులభతరం అని భావిస్తున్నాయి. ఇది అనైతికంగా ఉంటుందని నాయర్ అన్నారు ఇది ప్రమాదకరం అన్నారు. ఐటీ కంపెనీలు నైపుణ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని..ఏఐ తో కంపెనీలకు  లాభదాయకమే కాబట్టి ఉన్న ఉద్యోగులకు ఏఐ స్కిల్స్ పెంచేందుకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.