ఐదు రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమించిన కాంగ్రెస్

ఐదు రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. అందులో భాగంగా ఐదు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను పదవుల నుంచి తొలగించింది. ఇప్పుడు ఆ రాష్ట్రాలకు ఇంచార్జిలను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్కు అవినాష్ పాండే, గోవాకు రజినీ పాటిల్, మణిపూర్కు జైరాం రమేష్, పంజాబ్కు అజయ్ మాకెన్ ను కేటాయించింది.

మరిన్ని వార్తల కోసం...

‘ఆర్ఆర్ఆర్’ కు ఏపీ ప్రభుత్వ గుడ్‎న్యూస్

తెలంగాణలో మండుతున్న ఎండలు

కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను కూడా పుట్టడం అదృష్టం