బీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా.. వ్యతిరేకమా..? ఖర్గే

 బీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా.. వ్యతిరేకమా..? ఖర్గే

న్యూఢిల్లీ: రాజ్యాంగానికి బీజేపీ అనుకూలమా..? వ్యతిరేకమా అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం రాజ్య సభలో రాజ్యంగంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొని ప్రసంగించిన ఖర్గే.. బీజేపీపై విమర్శలు వర్షం కురిపించారు. బీజేపీ విభజన సూత్రాన్ని పాటిస్తోందని.. ఎన్డీఏ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.  రాజ్యాంగంపై బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదని.. కనీసం రాజ్యాంగంపై చర్చకు కూడా ఆ పార్టీ అంగీకరించట్లేదని విమర్శించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీని ఉద్దేశపూర్యకంగా బీజేపీ కించపరుస్తోందని మండిపడ్డారు. 

AALSO READ | దేశానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు: కేంద్ర మంత్రి అమిత్ షా

దేశం కోసం బీజేపీ నేతలు ఎప్పుడూ పోరాటం చేయలేదని.. అలాంటి వ్యక్తులు నెహ్రూ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాథమిక సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎన్నడూ ఆసక్తి లేదని.. జాతీయ జెండా, రాజ్యాంగాన్ని కూడా బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని ధ్వజమెత్తారు. జుమ్లావాలాలు దేశాన్ని తప్పు దో పట్టిస్తున్నారని.. బీజేపీ నేతలు గోబెల్స్ కంటే ఎక్కువ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన ఆరోగ్య భద్రతా విధానం కొవిడ్ టైంలో పేద ప్రజలను ఆదుకుందన్నారు. రాజ్యాంగం బలోపేతానికి ప్రధాని ఏం చర్యలు చేపట్టారని సూటిగా ప్రశ్నించిన ఖర్గే.. ఏం సాధించమో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.