ఖనిజ సంపదపైనే దృష్టి.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే ఫైర్

ఖనిజ సంపదపైనే దృష్టి.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే ఫైర్

రాంచీ: జార్ఖండ్ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఉద్దేశం బీజేపీకి ఎంతమాత్రం లేదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రంలోని విలువైన ఖనిజ సంపదను దోచుకోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమని అన్నారు. మంగళవారం జార్ఖండ్ మాండులో జరిగిన ఎన్నికల ర్యాలీలో  ఖర్గే ప్రసంగించారు. ‘‘జార్ఖండ్ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఉద్దేశం బీజేపీకి లేదు. రాష్ట్రంలోని విలువైన ఖనిజ సంపదను ఆ పార్టీ దోచుకోవాలనుకుంటుంది. చొరబాటుదారుల గురించి కాషాయ పార్టీ మాట్లాడుతుంటుంది.

 కానీ, కేంద్రం, అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాలు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాని మోదీ అబద్ధాలకు సర్దార్. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవి ఎక్కడికి పోయాయి. దోపిడీని మాత్రమే ఊపిరిగా బతికే వారితో జాగ్రత్తగా ఉండాలి. గిరిజన సీఎం నుంచి అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోవాలనుకుంటుంది. కానీ, హేమంత్ సోరెన్‎ను ఎవరు తొలగించలేరు” అని ఖర్గే పేర్కొన్నారు.