ఎల్లారెడ్డి, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంజారాలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారని, ఈసారి తెలంగాణలో అధికార మార్పిడి ఖాయమని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు రమేశ్ చౌహాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డిలో మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చౌహాన్మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు ఓటేయకుంటే పింఛన్లు బందవుతాయని ఆ పార్టీ నేతలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసే, ఇలాంటి ప్రచారాలకు ఒడిగడుతున్నారన్నారు.
ఇరవై రోజుల్లో కేసీఆర్దుకాణం బంద్ అవుతుందని, సర్వేలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర పక్కనున్న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్అధికారంలోకి వస్తే మదన్ మోహన్మంత్రి అవుతారని చెప్పారు. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.