నవంబర్ 19న ఖానాపూర్​కు ప్రియాంక గాంధీ రాక

ఖానాపూర్, వెలుగు: అసెంబ్లీ  ఎన్నికల  ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం ఖానాపూర్​కు వస్తున్నారు. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో నిర్వహించే విజయ భేరి సభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్​పీజీ కేంద్ర బృందంతో పాటు అడిష నల్ ఎస్పీ, జిల్లా పోలీసులు, ఆయా శాఖల అధికారులు శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర బృందం సెక్యూరిటీ అధికారులతో ఖానాపూర్​ కాంగ్రెస్​అభ్యర్థి వెడ్మ బొజ్జు సమావేశమై పలు సూచనలు చేశారు.

ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు జనాలను సిద్ధం చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిఘా  విభాగం ఖానాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. జిల్లా అడిషనల్ ఎస్పీ తో పాటు జాతీయస్థాయి భద్రత అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.