టీఆర్ఎస్, బీజేపీలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

బీజేపీ మత పరంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘మా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి విజయం కల్పిస్తుంది. హైదరాబాద్ అన్ని రకాల వర్గాల కలయికలతో జీవనం సాగించే నగరం. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. బీజేపీ మతంతో, టీఆర్ఎస్ అవినీతితో కూడుకొని ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ అంటున్నారు. రాష్టానికి వచ్చిన కేంద్ర మంత్రులందరూ టీఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్లు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఐ.టి., ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?  టీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని చెడగొట్టేలా మాట్లాడుతున్నారు’ అని ఆయన అన్నారు.

For More News..

డిజిటల్ మీడియా వ్యాప్తికోసం ఇ-కాన్‌క్లేవ్‌

రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్