హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి వందేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం కర్నాటకలోని బెళగావిలో ఏఐసీసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి, తర్వాత జరిగిన సభకు రాష్ట్రం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, రాష్ట్ర ఇన్చార్జీ దీపాదాస్ మున్షితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.