- ఎలాంటి నోటీసులూ ఇవ్వలే
- 2015 నుంచి స్పోర్ట్స్ వెంచర్
- సోదరుడి భవనం కూల్చివేతపై
- కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పల్లం రాజు ట్వీట్
హైదరాబాద్: దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేయడం బాధాకరమని ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రజాజీవితంలో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్న తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉంద న్నారు.
న సోదరుడు ఆనంద్ 7 ఎకరాలు భూమి లీజుకు తీసుకొని స్పోర్ట్స్ వెంచర్ (ఆర్‌వోఆర్) ఏర్పాటు చేశారని, ఇందుకోసం తీసుకున్న అనుమతులను పరిగణనలోకి తీసుకోకుండా, నోటీసు లేకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆర్‌వోఆర్ 2015 నుంచి పనిచేస్తున్నదని, ఆనంద్ కష్టపడి సంపాందించిన డబ్బులతో దీన్ని ఏర్పాటు చేశారని పల్లంరాజు ఎక్స్‌లో పోస్టు చేశారు.
ALSO READ | రెండు గంటల్లో కూల్చేస్తం.. స్టేలు తెచ్చుకునే టైం ఇవ్వం: హైడ్రా కమిషనర్ రంగనాథ్