
ఎన్నికల ఫలితాల వస్తున్న వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ నిర్వహించారు. 232 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించిందని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో నైతికంగా ఇండియా కూటమి విజయం సాధించిందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదన్నారు. ప్రస్తుతం భారతదేశ ప్రజలు మోదీని వ్యతిరేకించినట్టు భావిస్తున్నామని ఖర్గే అన్నారు.ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయం సాధించామన్నారు. ఈ తీర్పు మోదీకి నైతిక ఓటమి అన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచారన్న ఆయన... రాహుల్ జోడో యాత్రకు బీజేపీ ఎన్నో అడ్డంకులు సృష్టించిందన్నారు. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామన్నారు.
2024 ఎన్నికలు మోదీ వర్శెస్ ప్రజలు అన్న రీతిలో జరిగాయన్నారు. రాహుల్ యాత్రలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మైలేజ్ తెచ్చాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార గర్వంతో ఎన్నో వ్యవస్థలను ధ్వంసం చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.